Stock Market Opening 10 March 2023: 


స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. యూస్‌ ఫెడ్‌ హాకిష్‌ కామెంట్స్‌, ద్రవ్యోల్బణం నియంత్రణలో వైఫల్యం, అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు, బ్యాంకింగ్‌ రంగంపై ఒత్తిడి నష్టాలకు కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 178 పాయింట్లు తగ్గి 17,413 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 661 పాయింట్లు పతనమై 59,134 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 59,806 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,259 వద్ద మొదలైంది. 58,884 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,262 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 661 పాయింట్ల నష్టంతో 59,134 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


గురువారం 17,589 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,443 వద్ద ఓపెనైంది. 17,324 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,451 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 178 పాయింట్లు పతనమై 17,413 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 40,805 వద్ద మొదలైంది. 40,390 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,839 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 672 పాయింట్లు తగ్గి 40,583 వద్ద నడుస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, బ్రిటానియా, దివిస్‌ ల్యాబ్‌, ఐటీసీ, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు, ఎల్‌టీ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్‌ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.56,070 గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.65,250 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 పెరిగి రూ.24,740 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.