Multibagger Stocks In Defence Sector 2024: ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్‌ మంచి బూమ్‌లో ఉంది, ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఒరవడిలో చాలా కంపెనీలు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రక్షణ రంగ సంస్థల గురించి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగానికి అత్యధిక కేటాయింపులు చేసింది. ఒకవేళ.. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటైతే, రక్షణ రంగానికి కేటాయింపులు స్థిరంగా కొనసాగుతాయన్న విశ్వాసం మార్కెట్‌లో ఉంది. ఈ కారణంతో, గత కొన్నాళ్లుగా డిఫెన్స్‌ సెక్టార్ స్టాక్స్‌ మిస్సైళ్లలా దూసుకెళ్తున్నాయి. వాటిలో కొన్ని షేర్లు మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ అందించాయి.


రక్షణ రంగంలోని మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌


ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ (Astra Microwave Products): ఈ షేర్‌ మార్కెట్‌ ప్రైస్‌ రూ. 681.40. గత గత 12 నెలల (ఏడాది) కాలంలో ఈ షేర్‌ 110 శాతం పైగా పెరిగింది. గత ఆరు నెలల కాలంలో 48 శాతం పైగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 12 శాతం పైగా లాభపడింది. ఈ స్టాక్‌ 52 వారాల (ఏడాది) గరిష్ఠ స్థాయి 729.25 రూపాయలు.


భారత్ ఎలక్ట్రానిక్స్ (Bharat Electronics): ఈ షేర్‌ ప్రస్తుత ధర రూ. 234.40. గత ఒక సంవత్సర కాలంలో ఈ స్టాక్‌ దాదాపు 120 శాతం రాబడిని పెట్టుబడిదార్లకు ఇచ్చింది. గత ఆరు నెలల కాలంలో 70 శాతం పైగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 27 శాతం లాభాలు అందించింది. ఈ స్టాక్‌ ఏడాది గరిష్ఠ స్థాయి 241.65 రూపాయలు.


హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (Hindustan Aeronautics): ప్రస్తుతం షేర్‌ ప్రైస్‌ రూ. 3,923. గత 12 నెలల కాలంలో ఈ స్టాక్ 166 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లోనే 102 శాతం పైగా ర్యాలీ చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 39 శాతం విలువ పెరిగింది. ఈ స్టాక్‌ ఏడాది గరిష్ఠ స్థాయి 4,044.75 రూపాయలు.


మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ ‍‌(Mazagon Dock Shipbuilders): ఒక్క ఏడాదిలోనే ఈ స్టాక్‌ రెండు రెట్లకు పైగా (202 శాతం) రాబడిని ఇచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తే, ఇప్పుడు ఆ విలువ రూ.3 లక్షలు దాటుతుంది. ప్రస్తుతం షేర్ విలువ రూ. 2,359. గత ఆరు నెలల కాలంలో 21 శాతం పైగా రిటర్న్‌ ఇచ్చిన ఈ స్టాక్‌, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేవలం 3 శాతం పెరిగింది. 52 వారాల గరిష్ఠ స్థాయి 2,524.80 రూపాయలు.


జెన్ టెక్నాలజీస్ (Zen Technologies): శుక్రవారం ఈ కంపెనీ షేర్లు రూ.1,088.50 వద్ద ముగిశాయి. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 280 శాతం లాభపడింది. గత ఆరు నెలల కాలంలో దాదాపు 54 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 38 శాతం ర్యాలీ చేసింది. 52 వారాల (ఏడాది) గరిష్ఠ స్థాయి 1,130 రూపాయలు.


భారత్ డైనమిక్స్ ‍‌‌(Bharat Dynamics) స్టాక్‌ దాదాపు మల్టీబ్యాగర్‌ స్థాయి వరకు వచ్చింది. ప్రస్తుతం, ఒక్కో భారత్ డైనమిక్స్‌ షేరు రూ. 1,959.85 ధర పలుకుతోంది. గత 12 నెలల కాలంలో ఈ కంపెనీ షేర్లు 88.38 శాతం రాబడి ఇచ్చాయి. గత ఆరు నెలల్లోనూ దాదాపు ఇదే లాభం కనిపించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 13 శాతం పైగా పెరిగింది. ఈ స్టాక్‌ 52 వారాల గరిష్ట స్థాయి 2,097.95 రూపాయలు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: టాప్‌ గేర్‌లో జీఎస్‌టీ వసూళ్లు, రివర్స్‌ గేర్‌లో ఫారెక్స్‌ రిజర్వ్స్‌ - ఎందుకిలా?