Multibagger Stocks: 2023 క్యాలెండర్‌ ఇయర్‌లో తొలి సగం మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో షేర్‌ మార్కెట్‌ను చూస్తే, ఈక్విటీల్లో అసహనం కనిపించింది. కేవలం కొన్ని స్టాక్సే స్టెడీగా రేస్‌ చేశాయి. వాటిలో 33 కౌంటర్లు దలాల్ స్ట్రీట్‌లో దమ్ము చూపించాయి, ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు పైగా పెంచాయి. 


2023 మొదటి అర్ధభాగంలో ఇప్పటి వరకు, బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ 3.5% రాబడిని ఇచ్చింది, గత వారం జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్‌ ఇచ్చిన స్టాక్స్‌లో ఎక్కువ భాగం మిడ్‌ & స్మాల్‌ క్యాప్ జోన్‌ నుంచి వచ్చాయి.


ఈ 33 స్టాక్స్‌లో, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు చెందినవి ఒక్కొక్కటి ఉన్నాయి. లార్జ్‌ క్యాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు అడుగు ముందుకు వేయడానికి ఆపసోపాలు పడితే.. మిడ్‌ క్యాప్ & స్మాల్‌క్యాప్ టెక్నాలజీ స్టాక్స్‌ అనుకూలమైన రిస్క్-రివార్డ్‌తో పెట్టుబడిదార్ల ఆసక్తిని ఆకర్షించాయి.


గత ఏడాది నవంబర్‌లో దలాల్‌ స్ట్రీట్‌లోకి అడుగు పెట్టిన కేన్స్ టెక్నాలజీ, ఒక్క సంవత్సరం కూడా తిరక్కుండానే ఇన్వెస్టర్ల డబ్బులను డబుల్‌ చేసింది.


ఆ 33 కౌంటర్ల గురించి ప్రస్తావించాలంటే లిస్ట్‌ పెద్దదవుతుంది ఉంటుంది కాబట్టి, వాటి నుంచి కొన్నింటిని వడపోసి తీసేశాం. కనీసం రూ. 500 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న వాటిని మాత్రం షార్ట్‌ లిస్ట్‌ చేసి, వాటిలోనూ టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌ ఇచ్చిన టాప్‌-10 స్టాక్స్‌ను లెక్కలోకి తీసుకున్నాం.


2023లో ఇప్పటి వరకు 'స్టార్‌ పెర్ఫార్మర్స్‌':


రెమెడియం లైఫ్‌కేర్ (Remedium Lifecare) 
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చిన లాభం 2,573 శాతం


ఆంధ్ర సిమెంట్స్ (Andhra Cements) 
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చిన లాభం 1,392 శాతం


K&R రైల్ ఇంజనీరింగ్ (K&R Rail Engineering) 
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చిన లాభం 689 శాతం


సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ ‍(Suryalata Spinning Mills) 
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చిన లాభం 310 శాతం


జేఐటీఎఫ్‌ ఇన్‌ఫ్రా లాజిస్టిక్స్‌ ‍(JITF Infralogistics) 
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చిన లాభం 271 శాతం


ఆరియన్‌ప్రో సొల్యూషన్స్‌ (Aurionpro Solutions) 
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చిన లాభం 200 శాతం


EFC (I) 
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చిన లాభం 175 శాతం


న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్‌ ‍(Nucleus Software Exports) 
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చిన లాభం 172 శాతం


మాస్టర్ ట్రస్ట్ (Master Trust) 
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చిన లాభం 160 శాతం


శాక్సాఫ్ట్ (Saksoft) 
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చిన లాభం 160


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఫ్లైట్‌ ఎక్కబోతున్నారా?, రీసెంట్‌గా మారిన వీసా రూల్స్‌ గురించి తెలుసుకోండి 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial