HDB Financial: స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాల కారణంగా అనిశ్చితంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అనేక బడా కంపెనీల ఐపీవోలు కూడా లిస్టింగ్ తర్వాత సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు హెచ్‌డీబీ ఫైనాన్షియల్ వంతు వచ్చింది. రూ.10,000 కోట్ల భారీ లిస్టింగ్ తర్వాత హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధిగమించగలదా అని బిజినెస్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
గత ఎనిమిది రూ.10,000 కోట్లు దాటిన ఐపీఓలలో ఆరు, లిస్టింగ్ తర్వాత ఆరు నెలల్లో సగటున 20 శాతం నష్టాలను చవిచూశాయి. హ్యుందాయ్ మోటార్ 6 నెలల్లో 7 శాతం తగ్గింది. స్విగ్ 30 శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ కార్డ్స్ మాత్రమే 50% రాబడిని ఇచ్చింది. అది కూడా కోవిడ్ తర్వాత మార్కెట్ ర్యాలీ వ్లల సాధ్యమయింది. పెద్ద ఐపీఓలు మార్కెట్‌లో లిక్విడిటీ గ్రహించడంతో పనితీరు తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మద్దతుతో అనుబంధ సంస్థ అయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ రూ.12,500 కోట్ల ఐపీఓను ప్రారంభించింది. రూ.2,500 కోట్లు ఫ్రెష్ ఇష్యూ, రూ.10,000 కోట్లు ఆఫర్-ఫర్-సేల్ ఇందులో ఉన్నాయి. షేర్ ధర రూ.700–740, గరిష్ఠంగా రూ.61,000 కోట్ల విలువ ఉంటుందని అంచనా. జూన్ 27, 2025న ముగిసిన ఈ ఐపీఓకు రూ.1.61 లక్షల కోట్ల బిడ్స్ వచ్చాయి. ఇది రూ.10,000 కోట్ల ఐపీఓలలో రెండో అత్యధిక సబ్‌స్క్రిప్షన్ . మొదటి స్థానంలో టాటా టెక్నాలజీస్ ఉంది. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (QIB) 55.47 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేశారు, రిటైల్ ఇన్వెస్టర్లు 1.4 రెట్లు మాత్రమే.
జూలై 2, 2025న హెచ్‌డీబీ షేర్లు రూ.835 వద్దలిస్ట్ అయ్యాయి. తర్వాత రూ.845.75కు చేరింది. మార్కెట్ క్యాప్ రూ.70,198 కోట్లకు చేరింది. ఇది భారతదేశంలో ఎనిమిదో అతిపెద్ద NBFCగా నిలిచింది. బజాజ్ ఫైనాన్స్‌తో పోలిస్తే తక్కువ వాల్యుయేషన్ ఉన్నప్పటికీ, హెచ్‌డీబీ బలమైన ఫండమెంటల్స్ (15% ROE) కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మద్దతు బలమైన ఫండమెంటల్స్‌తో హెచ్‌డీబీ ఈ సెంటిమెంట్ ను అధిగమించే అవకాశం ఉంది. - బలమైన లిస్టింగ్ పనితీరు రిటైల్ ఆసక్తిని పునరుద్ధరించవచ్చు, ఇతర NBFC ఐపీఓలకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెబుతున్నారు.