Vijay Mallyas failed company  Berger Paints :  బర్జర్ పెయింట్స్ .. ఈ పేరు వినని భారతీయులు ఉండరు. అంత సక్సెస్ అయిన కంపెనీ  అప్పుల పాలై పారిపోయిన విజయ్ మాల్యాది అని చాలా మందికి తెలియదు. లాభాలు రావడం లేదని..భవిష్యత్ ఉండదనుకుని అతి తక్కువకే బర్జర్ పెయింట్స్ విజయ్ మాల్యా 1990ల్లో అమ్మేారు. అప్పటికి ఈ కంపెనీ రంగుల అమ్మకాలు అంత గొప్పగా ఉండేవి కావు. పైగా విజయ్ మాల్యా కు ఈ రంగంలో అంత రంగుల ఉంటాయని అనిపించలేదు. అందుకే వచ్చినంత తసుకుని పంజాబ్ కు చెందిన ధింగ్రా బ్రదర్స్ కు అమ్మేశారు. ఇప్పుడా కంపెనీ విలువ 68 వేల కోట్లు అయింది. ఇలా అవుతుందని తెలిస్తే విజయ్ మాల్యా అసలు అమ్ముకునేవారు కాదేమో . 


1990లలో  థింగ్రా బ్రదర్స్‌కు బెర్జర్ పెయింట్స్ అమ్మేసిన విజయ్ మాల్యా             


కుల్ దీప్ సింగ్ ధింగ్రా, గురు బచన్ సింగ్ ధింగ్రా ఇద్దరూ సోదరులు. వారి తాతల హయాం నుంచి పెయింట్స్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. అయితే వీరి వ్యాపారం చిన్న స్థాయిలో ఉండేది. ఈ సోదరుల చేతికి వ్యాపారం వచ్చే నాటికి కాస్త అభివృద్ధి చెందింది. ఇతర దేశాల్లోనూ క్లయింట్లు వచ్చారు. ఇంకా విస్తరించడానికి ఎంతో అవకాశం ఉందని ..  అనుకుంటున్న సమయంలో బెర్జర్ పెయింట్స్ మాల్యా అమ్మేయాలనుకుంటున్నారని తెలుసుకున్నారు. వెంటనే సంప్రదించి అడిగినంత ధర ఇచ్చి సొంతం చేసుకున్నారు. విజ్య మాల్యా కూడా వదిలించుకుందామనుకుంటున్న సమయంలోనే ధింగ్రా  బ్రదర్స్ సంప్రదించడంతో పెద్దగా ఎక్కువ చెప్పకుండానే ఇచ్చేశారు.   


ఏడాదికి పది వేల కోట్లుపైగా టర్నోవర్ - కంపెనీ వాల్యూ రూ. 68వేల కోట్లు  


తమ చేతికి వచ్చిన తర్వాత కూడా ధింగ్రా బ్రదర్స్ కంపెనీ పేరు మార్చలేదు. అదే  పెయింట్స్ బ్రాండ్స్ తో వ్యాపారం చేశారు. ఇతర దేశాల్లోనూ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఇప్పుడు బర్జర్ పెయింట్స్ మన దేశంలో ఆసియన్ పెయింట్స్ తర్వాత అతి పెద్ద కంపెనీ. రష్యా, పోలండ్, నేపాల్,  బంగ్లాదేశ్‌లలో భారీ మార్కెట్ ను సొంతం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో బర్జర్ పెయింట్స్ ఆదాయం పది వేల కోట్లకు దాటిపోయింది. మొత్తం కంపెనీ విలువ 68 వేల కోట్లకు చేరుకుంది. రంగుల పరిశ్రమలో ధింగ్రా బ్రదర్స్ ను ఎంతో ఉన్నత స్థానంలో నిలిపింది. 


రూ. 7 వేల కోట్లు అప్పులు చెల్లించలేక పరారయిన విజయ్ మాల్యా                


విజయ్ మాల్యా కేవలం ఏడు వేల కోట్లు లోన్ తీసుకుని పారిపోయారని కేసులు నమోదయ్యాయి. ఆయనకు ఉన్న ఆస్తులతో పోలిస్తే.. ఈ అప్పులు పెద్ద మొత్తమేం కాదన్న అంచనాలు ఉన్నా ఆయన పారిపోయి లండన్ లో ఉండిపోయారు. బ్యాంకులకు డబ్బులు తిరిగి కట్టలేదు. అదే బెర్జర్ పెయింట్స్ ఆయనే ఉంచుకున్నట్లయితే.. పారిపోవాల్సిన అవసరం ఉండేది కాదని అంచనా. అయినా రాసి పెట్టి ఉండాలని.. బిజినెస్ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.