Stock Market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు బడ్జెట్ ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ పెట్టుబడిదారుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల వరకు అందరూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏఏ రంగాలను ప్రాధాన్యతా క్రమంలో ఉంచనున్నారనే క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో యూనియన్ బడ్జెట్ రోజున లాభాలతో సానుకూలంగా ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి.
ఈ క్రమంలో ఉదయం 9.15 గంటలకు స్టాక్ మార్కెట్లలోని బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 200 పాయింట్ల లాభంతో బలమైన ఓపెనింగ్ నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ సైతం స్వల్ప లాభంతో ముందుకు సాగుతోంది. అయితే మార్కెట్లు ప్రారంభమైన కొన్ని నిమిషాలకే ఈ ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమై తమ ట్రేడింగ్ జర్నీ ప్లాన్ చేసుకునేందుకు ఆసక్తింగా వేచి చూస్తున్నారు. ఆర్థిక మంత్రి పార్లమెంటులో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే వరకు ఇదే స్తబ్ధత కొనసాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దీంతో ప్రస్తుతం నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. ఆటో, పవర్ రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో మెటల్ రంగాలకు చెందిన కంపెనీలు మాత్రమ్ బడ్జెట్ ప్రసంగం ముందు నష్టాల్లో మార్కెట్లను కిందకు లాగుతున్నాయి. అలాగే షిప్పింగ్ రంగానికి చెందిన కంపెనీల షేర్లు బడ్జెట్లో అధిక కేటాయింపులు ఉండొచ్చనే ఊహాగానాల మధ్య లాభాల్లో సాగుతున్నాయి.
ఈ క్రమంలో ఇంట్రాడేలో నిఫ్టీలో అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇదే సమయంలో శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌సిఎల్ టెక్, ఓఎన్‌జీసీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, దివీస్ ల్యాబ్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముందుకు సాగుతున్నాయి.
నేడు క్యూ1 ఫలితాలు ప్రకటించే కంపెనీలు:
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలోని లిస్టెడ్ కంపెనీలు వరుసగా తమ క్యూ1 కార్పొరేట్ ఫలితాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు హిందుస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్, యునైటెడ్ స్పిరిట్స్, AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, DCM శ్రీరామ్, హెరిటేజ్ ఫుడ్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఏఐ, ఇండోకో రెమెడీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, M&M ఫైనాన్షియల్ సర్వీసెస్, పరాగ్ మిల్క్ ఫుడ్‌కెమ్, పరాగ్ మిల్క్ ఫుడ్ కెమ్ SRF, థైరోకేర్ టెక్నాలజీస్, వెల్స్పన్ స్పెషాలిటీ సొల్యూషన్స్ కంపెనీలు ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఆదాయాలను ప్రకటించనున్నాయి.