Adani Group Clarification: అస్సాం ప్రభుత్వం దిమా హసావోలోని 3000 బిఘాలను సిమెంట్ ప్లాంట్ కోసం అదానీ గ్రూప్‌కు కేటాయించిందని వచ్చిన వార్తలపై ఆదాని గ్రూప్ వివరణ ఇచ్చింది. ఆ నివేదికలు , వార్తలు నిరాధారమైనవి, తప్పుడువి , తప్పుదారి పట్టించేవి అని అదాని గ్రూప్ ప్రకటించింది. అదానీ పేరును మహాబల్ సిమెంట్‌తో లింక్ చేయడం సరి కాదన్నారు. మహాబల్ సిమెంట్ అదానీ గ్రూప్‌తో సంబంధం కలిగి లేదని స్పష్టం చేశారు. యాజమాన్యంలోనే కాదు ఏ విధంగానూ సంబంధం కలిగి లేదని అదాని గ్రూప్ తెలిపింది.
అటువంటి వాదనలు చేసే లేదా పంచుకునే ముందు వాస్తవాలను ధృవీకరించాలని మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అదాని గ్రూప్ కోరింది. ఇలాంటి వార్తను నమ్మవద్దని అదాని గ్రూప్ ప్రజలను కోరింది. ధృవీకరించని, తప్పుదారి పట్టించే సమాచారం అనవసరమైన గందరగోళాన్ని కూడా సృష్టిస్తుందని అదాని గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్ 2025 ఆగస్టు 18న అహ్మదాబాద్ నుండి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది, ఇది అస్సాం ప్రభుత్వం దిమా హసావో జిల్లాలో 3,000 బిఘాల భూమిని సిమెంట్ ప్లాంట్ నిర్మాణం కోసం అదానీ గ్రూప్‌కు కేటాయించిందని పేర్కొంటూ వచ్చిన కొన్ని వార్తా నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు మరియు కోర్టు విచారణలకు సంబంధించిన క్లిప్‌లను స్పష్టంగా ఖండించింది. ఈ ప్రకటనలో, ఈ వాదనలను అదానీ గ్రూప్ నిరాధారమైనవి, తప్పుడువి మరియు తప్పుదారి పట్టించే వాటిగా వర్ణించింది.
అస్సాంలో 1 బిఘా సాధారణంగా 0.33 ఎకరాలు. అంటే మూడు బిఘాలు కలిస్తే ఎకరం. అంటే దాదాపుగా వంద ఎకరాలను అస్సాం ప్రభుత్వం కేటాయించిందని ప్రచారం జరుగుతోంది. అయితే మహాబల్ అనే సిమెంట్ కంపెనీకి కేటాయిస్తే.. అది అదానీదన్న తప్పుడు ప్రచారం జరగడంతో కంపెనీ స్పందించింది. మహాబల్ సిమెంట్‌కు అదానీ గ్రూప్‌తో ఎలాంటి సంబంధం లేదని, అది వారి యాజమాన్యంలో లేదని, లేదా ఏ రీతిలోనూ అనుబంధం లేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ఒక దుష్ట ఉద్దేశంతో కూడిన చర్యగా స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్ మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు , సామాన్య ప్రజలను ఇటువంటి వాదనలను ప్రచారం చేయడానికి ముందు లేదా షేర్ చేయడానికి ముందు వాస్తవాలను జాగ్రత్తగా ధృవీకరించాలని కోరింది. ధృవీకరించని సమాచారం లేదా తప్పుదారి పట్టించే కంటెంట్ వ్యాప్తి చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సమాచారం అందడమే కాకుండా, సమాజంలో అనవసరమైన గందరగోళం మరియు ఆందోళన కలుగుతుందని గ్రూప్ హెచ్చరించింది.