Maggi Trending: సోషల్‌ మీడియాలో ఎప్పుడేం ట్రెండ్‌ అవుతుందో ఊహించలేం! సడెన్‌గా మంగళవారం సాయంత్రం 'మ్యాగీ' (Maggi) ట్రెండ్‌ అవుతోంది. నెటిజన్లు నవ్వు పుట్టించే మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. అసలు మ్యాగీ ఎందుకు ట్రెండ్‌ అవుతోందంటే?


ఇండియాలో మ్యాగీ ఇన్‌స్టాంట్‌ నూడుల్స్‌కు చాలా డిమాండ్‌ ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు తొందరగా ఏమైనా తినాలనుకుంటే మ్యాగీనే ప్రిఫర్‌ చేస్తుంటారు. ఎందుకంటే నాలుగైదు నిమిషాల్లోనే దీనిని వండుకోవచ్చు. కాగా జొమాటో ఈ మధ్యే కొన్ని ఆహార పదార్థాలను పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఈ పది నిమిషాల డెలివరీలో మ్యాగీ డిష్‌ కూడా ఉంటుందని జొమాటో చెప్పడంతో నెటిజన్లు సర్‌ప్రైజ్‌ అయ్యారు. మ్యాగీ డెలివరీ చేయడమేంటని కొందరు ట్రోలింగ్‌ చేస్తున్నారు. మరికొందరేమో వావ్‌ అంటూ మీమ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. ట్విటర్లో సాయంత్రం నుంచి వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు.




10 నిమిషాల్లోనే డెలివరీ కోసం డెలివరీ పార్ట్‌నర్లపై ఎటువంటి ఒత్తిడీ పెట్టబోమని జొమాటో ఇంతకు ముందే తెలిపింది. ఆలస్యంగా డెలివరీ చేసినందుకు వారిపై ఎటువంటి పెనాల్టీ కూడా విధించబోమని పేర్కొంది. టైం ఆప్టిమైజేషన్ ప్రక్రియ రోడ్డు మీద జరగబోదని తెలిపింది.




మరి 10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం అంటే?


ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఇలా చేయలేదు. ఈ ఫీట్ సాధించే మొదటి కంపెనీగా ఉండటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాం. జొమాటో ఇన్‌స్టంట్‌ను సాధించడానికి ఎనిమిది నిబంధనలను పాటించనున్నాం. అవేంటంటే...


1. ఇంటి ఆహారం వండటానికి అయ్యే ధరకే అందించడం (దాదాపుగా)
2.అత్యధిక నాణ్యతతో తాజా ఆహారం
3. ప్రపంచ స్థాయి పారిశుధ్య విధానాలు
4. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను వీలైనంత తక్కువ ఉపయోగించడం
5. సులభంగా తినడానికి వీలయ్యే కన్వీనెంట్ ప్యాకేజీ
6. ట్రేస్ చేయడానికి వీలయ్యే సప్లై చైన్
7. డెలివరీ పార్ట్‌నర్ భద్రత
8. రెస్టారెంట్ పార్ట్‌నర్లతో మరింత మెరుగ్గా భాగస్వామ్యం


దీని కోసం జొమాటో ఫినిషింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. వేర్వేరు రెస్టారెంట్లలో బెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ (సుమారు 20 నుంచి 30 వంటకాలు) ఇందులో ఉండనున్నాయి. డిమాండ్ ప్రెడిక్టబులిటీ (డిమాండ్‌ను అంచనా వేయడం), స్థానికంగా ఎక్కువ అమ్ముడయ్యే పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి ద్వారా దీన్ని సాధిస్తామని జొమాటో అంటోంది. దీంతో ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గనున్నాయి.