LIC WhatsApp Services: లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషనే (LIC). ప్రైవేట్ సెక్టార్‌లోని చాలా బ్యాంకులు, సంస్థలు జీవిత బీమా అందిస్తున్నా, అవేవీ ఎల్‌ఐసీకి పోటీ కావు. ఎందుకంటే, జీవిత బీమా మార్కెట్‌లో ఎల్‌ఐసీకి 60 శాతం వాటా పైనే ఉంది. దేశంలో కోట్లాది మందికి కనీసం ఒక్క ఎల్‌ఐసీ పాలసీ అయినా ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది కస్టమర్ల కోసం వాట్సాప్ ద్వారా సేవలను ఎల్‌ఐసీ ప్రారంభించింది. దీని ద్వారా ఆ సంస్థ నుంచి సేవలు పొందడం మరింత సులభం అవుతుంది. తన రిజిస్టర్డ్ పాలసీదారుల కోసం శుక్రవారం నుంచి (02.12.2022) ఈ తరహా మొట్టమొదటి ఇంటరాక్టివ్ సేవను కంపెనీ ప్రారంభించింది.
ఎల్‌ఐసీ సేవలను వాట్సాప్‌లో ఎలా యాక్టివేట్ చేయాలి?
కస్టమర్ పోర్టల్‌లో పాలసీని నమోదు చేసుకున్న వినియోగదారు మొబైల్ నంబర్ 8976862090కి "Hi" అని మాత్రమే సందేశం పంపాలి. ఆ తర్వాత క్లయింట్‌కు చాట్‌బాట్ ద్వారా 11 సర్వీస్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి సర్వీస్ ఆప్షన్‌కు ఒక నంబర్ ఉంటుంది. ఏ సేవ కావాలని మీరు కోరుకుంటారో, ఆ సేవకు ఎదురుగా ఉన్న నంబర్‌ను వాట్సాప్ ద్వారా పంపితే సరి.
వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్న సేవల జాబితా ఇది:
ప్రీమియం బకాయి
బోనస్ సమాచారం
పాలసీ స్థితి
మీ ప్రస్తుత పాలసీ మీద ఎంత రుణం తీసుకోవచ్చు?
రుణం తిరిగి చెల్లింపు
రుణం మీద వడ్డీ బకాయి
ప్రీమియం చెల్లింపు పత్రం
యులిప్ - యూనిట్ల స్టేట్‌మెంట్
ఎల్‌ఐసీ సేవలకు సంబంధించిన లింక్‌లు
ఆప్ట్ ఇన్ /ఆప్ట్ ఔట్ సేవలు
ఎల్‌ఐసీ పోర్టల్‌లో తమ పాలసీ ప్లాన్లను నమోదు చేసుకున్న పాలసీదారులకు మాత్రమే ఎల్‌ఐసీ వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయి. మీకు ఒక ఎల్‌ఐసీ పాలసీ ఉండి, ఇంట్లోంచి కదలకుండా వాట్సాప్ ద్వారా కంపెనీ సేవలను అందుకోవాలంటే, ముందుగా www.licindia.in లో ఉన్న కస్టమర్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఎల్‌ఐసీ పోర్టల్‌లో ఎల్‌ఐసీ పాలసీని ఎలా నమోదు చేసుకోవాలి?
స్టెప్ 1: www.licindia.in ని సైట్‌లోకి వెళ్లి, “కస్టమర్ పోర్టల్”పై క్లిక్ చేయండి
స్టెప్ 2: కస్టమర్ పోర్టల్ కోసం గతంలో మీరు రిజిస్టర్ చేసుకోకుంటే, “న్యూ యూజర్” బటన్ మీద క్లిక్ చేయండి
స్టెప్ 3: ఈ కింది వివరాలు అందించండి:
స్టెప్ 4: యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుని, అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించండి. ఇప్పుడు మీరు పోర్టల్‌లో రిజిస్టర్ అయినట్లే.
స్టెప్ 5: ఇప్పుడు "ఈ-సర్వీసెస్" ట్యాబ్‌ను క్లిక్ చేయండి. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి. ఈ-సేవలను ఉపయోగించుకునేందుకు మీ పాలసీను అక్కడ కనిపించే ఫారంలో నింపండి.
స్టెప్ 6: ఫారంను ప్రింట్ తీసి, దాని మీద సంతకం చేసి, సంతకం చేసిన ఫారాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 7: పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ స్కాన్ చేసిన కాపీని కూడా అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 8: ఎల్‌ఐసీ ఆఫీసు దానిని ధృవీకరించుకుంటుంది. మీకు ఒక రిసిప్ట్ ఈ-మెయిల్, SMS ద్వారా అందుతుంది. ఇప్పుడు మీరు ఈ-సేవలను పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లే.
స్టెప్ 9: ఇప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి
స్టెప్ 11: మీరు మళ్లీ లాగిన్ అయితే, 'బేసిక్ సర్వీసెస్' > "యాడ్ పాలసీ" ఆప్షన్ మీద క్లిక్ చేయండి
స్టెప్ 12: మీ మిగిలిన పాలసీలన్నింటినీ నమోదు చేయండి.
అంతే, వాట్సాప్ సేవలు అందుకోవడానికి మీరు సిద్ధం.