బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది మంచి సమయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటారా? బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి కాస్త నేలచూపులు చూస్తోంది. ఇలాంటి సమయంలో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తే మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే బంగారం రేంజ్ ఎప్పటికప్పుడు పెరుగుతుందే కానీ తగ్గదు. పైగా బంగారం కొనడం అంటే చిన్న విషయం కాదు. చేతిలో డబ్బులు దండిగా ఉండాలి. ఇలాంటి వారి కోసం గోల్డ్ స్కీమ్ పెట్టిన లలితా జ్యూయలరీస్... ఇప్పుడు అదే మధ్యతరగతి వారి కోసం ఆభరణాల ప్రీ బుకింగ్ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కేవలం ఆభరణాలు మార్పిడి పథకం మాత్రమే కాదు... మధ్యతరగతి వారికి బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ కూడా. 




ఇంతకీ ఆభరణాల ప్రీ బుకింగ్ పధకం ఏంటంటే... ఇంట్లో చాలా బంగారం ఉంది కానీ మార్కెట్లో ఉన్న లెటెస్ట్ మోడల్ లేదనే ఆలోచన ఉన్నవారికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. మీ పాత బంగారు ఆభరణాలను జీరో కాస్ట్‌లో మార్చుకుని సరికొత్త నగలు తీసుకోండి. మీ పాత బంగారం మీద కేవలం మెల్టింగ్, ప్యూరిఫైయింగ్ ఛార్జీలు మాత్రమే తీసివేస్తారు. 11నెలల తర్వాత డెలివరీ తీసుకోవాలనుకుంటే మీరు తీసుకునే ఆభరణాలపై 100 శాతం తరుగు లేకుండా ఏ నగలైనా తీసుకెళ్లొచ్చు. ఐదు నెలల ముగింపులో కూడా, మీరు ఎంచుకున్న ఆభరణాల రకాన్ని బట్టి, మీరు తరుగు ఛార్జ్‌ల్లో పూర్తి మినహాయింపు పొందవచ్చు. మీ పాత ఆభరణాల విలువ BIS 916 హాల్‌మార్క్ ప్రమాణాల ప్రకారం ఉంటుంది. పాత ఆభరణాలను మార్చుకునే బదులు, మీరు ఒకేసారి చెల్లిస్తే ఈ ఆభరణాల కొనుక్కోవచ్చు.


బంగారం కొనుగోలుపై ఇతర జ్యూయలరీ సంస్థలు పలు బహుమతులు ప్రకటిస్తాయని... అయినా నగల పథకంలో ఫ్రీ గిఫ్టులు ఎందుకంటున్నారు లిలిత జ్యూయలరీ  ఎండీ కిరణ్ కుమార్. మనం చెల్లించే డబ్బులకు ఎన్ని గ్రాములు బంగారం లభిస్తోందో చూసుకోవాలని చెబుతారు. వాస్తవానికి ఫ్రీ గిఫ్టులు ధర వాళ్లు వేసే ఎమ్మార్పీలో సగం కూడా ఉండదని....వినియోగదారులు ఆ విషయం తెలుసుకోవాలని సూచిస్తున్నారు కిరణ్ కుమార్. పైగా లలితా జ్యూయలరీ ప్రవేశపెట్టిన ఆభరణాల ప్రీ బుకింగ్ పథకం మధ్యతరగతి వర్గాలకు చాలా ఉపయోగపడుతుందన్నారు..



ఇప్పటికే గతంలో ప్రవేశపెట్టిన లలితా జ్యూయలరీ లెవెన్ మంత్ జువెరీ పర్చేజ్ ప్లాన్‌కి విశేష స్పందన వస్తోందన్నారు కిరణ్. ఈ స్కీమ్ లో చేరితే ఒక నెల డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఒక నెల ఇన్‌స్టాల్‌మెంట్‌ను లలితా జువెలరీ మీ అకౌంట్‌లో జమ చేస్తుంది. అంటే మీరు 11 నెలలు డబ్బులు కట్టాలి. అంతేకాకుండా మీకు నచ్చిన బంగారు ఆభరణాలకు ఇంటికి తీసుకెళ్లొచ్చని వివరిస్తున్నారు. వీటి వీఏ చార్జీల్లో 50 శాతం తగ్గింపు లభిస్తుందంట. మీరు రూ.1000 నుంచి డబ్బులు చెల్లిస్తూ రావొచ్చు. రూ.1000, రూ.1500, రూ.2 వేలు, రూ.2,500 ఇలా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పారు కిరణ్.



 


(Sponsored Content)