Stocks to watch: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సైతం నష్టాల దారిలోనే పయనించాయి. ప్రధానంగా అధిక వ్యాల్యుయేషన్స్, దేశంలో లోక్ సభ ఎన్నికల జరగటం వల్ల కారణాలతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అయితే దీంతో బ్రాడ్ మార్కెట్లలోని అనేక రంగాల్లో అమ్మకాల కారణంగా.. నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో రియల్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు మాత్రం తమ లాభదాయకతను కొనసాగించాయి. బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్లు తెరుచుకోవటానికి ముందర ఇన్వెస్టర్లు గమనించాల్సిన కొన్ని షేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Larsen & Toubro: ముందుగా నేడు ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాల్సిన షేర్లలో ఎల్ అండ్ టి ఒకటి. టెక్నికల్స్ ఆదారంగా స్టాక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాట్రన్ కలిగి ఉంది. ప్రస్తుతం ఇవి బేయరిష్ ట్రెండ్ సూచిస్తోంది. ప్రస్తుతం షేర్లకు సపోర్ట్ లెవెల్ కింద రూ.3,280-3,200 పరిగణించొచ్చు. అలాగే ఎగువన రెసిస్టెన్స్ రూ.3,600 స్థాయిల వద్ద ఉంది. నేడు మార్కెట్ ట్రేడింగ్ సమయంలో పెట్టుబడిదారులు ఈ కంపెనీ షేర్లతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
Tata Power: నేడు మార్కెట్లలో భారీగా పెరిగేందుకు వీలున్న షేర్లలో టాటా పవర్ కంపెనీ ఒకటి. టెక్నికల్స్ ఆదారంగా రూ.430 స్థాయి వద్ద బ్రేకౌట్ ఉండనుంది. ఈ క్రమంలో షేరు టార్గెట్ ధర రూ.460-500గా నిపుణులు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో రూ.400 స్థాయిని స్టాప్ లాస్ కింద పరిగణించాలని సూచిస్తున్నారు.
Canara Bank: ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంక్ షేర్లు ఊహించని భారీ ర్యాలీని ఏడాదిగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో షేర్ ధర రూ.270 స్థాయి నుంచి రూ.630కి ఎగబాకింది. అయితే గడచిన రెండుమూడు సెషన్లలో కెనరా బ్యాంక్ షేర్లలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణను కొనసాగిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. నేడు ఇంట్రాడేలో స్టాక్ ధర రూ.620-660కి చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో రూ.530 స్థాయిని స్టాప్ లాస్ కింద పరిగణించాలని హెచ్చరిస్తున్నారు.
ఈరోజు మార్కెట్లోకి తమ ఫలితాలను విడుదల చేయనున్న కార్పొరేట్ కంపెనీలను గమనిస్తే.. బజాజ్ కన్స్యూమర్ కేర్, భారత్ ఫోర్జ్, కెనరా బ్యాంక్, గోద్రెజ్ అగ్రోవెట్, GSPL, హీరో మోటోకార్ప్, లార్సెన్ & టూబ్రో, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, స్టార్ హౌసింగ్ ఫైనాన్స్, సులా వైన్యార్డ్స్, టాటా పవర్, TVS మోటార్ కంపెనీ, విజయ డయాగ్నోస్టిక్, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ కంపెనీలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు వీటిపై ఓ కన్నేసి ఉంటాల్సి ఉంది.
బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ వన్‌లోని టెక్నికల్ అనలిస్ట్ రాజేష్ భోసలే రాబోయే రోజులో నిఫ్టీ 50లో అడపాదడపా ఇంట్రా-డే రీబౌండ్‌లను చూసే అవకాశం ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు లాంగ్ పొజిషన్‌లను తగ్గించుకోవడానికి ఇటువంటి రీబౌండ్‌లను ఉపయోగించాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు.
స్పెషల్ ట్రేడింగ్ గమనిక..
దేశంలోని స్టాక్ మార్కెట్లు మే 18 అంటే శనివారం నాడు ప్రత్యేకంగా లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. వాస్తవానికి ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ సైట్(DRS)కి ఇంట్రాడేలో మారడాన్ని వీరు పరీక్షించనున్నారు. ఈ క్రమంలో మే 18న ట్రేడింగ్ ప్రాథమిక సైట్ నుంచి ఉదయం 9:15 నుంచి 10:00 వరకు స్పెషల్ ట్రేడింగ్ జరగనుంది. దీని తర్వాత 11.30 నుంచి 12.30 వరకు డిజాస్టర్ రికవరీ సైట్ నుంటి ట్రేడింగ్ కొనసాగించనున్నారు. అయితే మే 18న స్టాక్‌ల గరిష్ట సర్క్యూట్ లిమిట్ 5 శాతానికి పరిమితం చేయబడుతుందని NSE స్పష్టం చేసింది.