Jury orders Google to pay Rs 3754 CroresL టెక్ దిగ్గజం గూగుల్‌కు అమెరికా కోర్టు నుంచి భారీ జరిమానా విధించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అనైతిక పద్ధతులు అవలంబించినందుకు గూగుల్‌కు సుమారు 4.5 బిలియన్ డాలర్లు  జరిమానా విధిస్తూ జ్యూరీ ఆదేశాలు జారీ చేసింది.  ఇది భారతీయ రూపాయల్లో 3800 కోట్లు వరకూ ఉండవచ్చు. ఈ తీర్పు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నేతృత్వంలోని కంపెనీకి కీలక సవాలుగా నిలిచింది.

గూగుల్‌పై అమెరికా యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.  స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో ఒప్పందాల ద్వారా తన సెర్చ్ ఇంజిన్ ,  యాప్ స్టోర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ముందుగా ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మార్కెట్ ఆధిపత్యాన్ని సాధించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ పద్ధతులు పోటీదారులకు అవకాశాలను తగ్గించి, వినియోగదారుల ఎంపికలను పరిమితం చేస్తున్నాయని యాంటీట్రస్ట్ రెగ్యులేటర్లు వాదించారు. 

ఈ కేసు యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ గూగుల్ (U.S. v. Google) పేరుతో డీసీ డిస్ట్రిక్ట్ కోర్టులో నడిచింది. ఆగస్టు 2025లో జడ్జి  గూగుల్ యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించిందని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఫలితంగా, గూగుల్ తన వ్యాపార పద్ధతులను సవరించుకోవాలని, రూ. 37,54,95,07,050 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

గూగుల్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ చేసే అవకాశం ఉంది. కంపెనీ ప్రతినిధులు, తమ సేవలు వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉండటం, ఆండ్రాయిడ్ వ్యవస్థ ఓపెన్ సోర్స్‌గా ఉండటం వల్ల పోటీని ప్రోత్సహిస్తున్నామని వాదించారు.  ఈ జరిమానా గూగుల్ ఆర్థిక స్థితిని పెద్దగా ప్రభావితం చేయనప్పటికీ, దీర్ఘకాలంలో దాని మార్కెట్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.