Jio Platforms IPO: స్టాక్ మార్కెట్ చరిత్రలో ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ సంచలనం సృష్టించింది. జియో ఐపీఓ షేర్లను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ పబ్లిక్ ఇష్యూకు ఏకంగా 10 మిలియన్లకు (కోటికి) పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా పబ్లిక్ ఇష్యూ హిస్టరీలో 10 మిలియన్ల సబ్ స్ర్కిప్షన్లు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 

Continues below advertisement

అక్టోబర్ 21న ప్రారంభమైన జియో ఐపీఓ బిడ్డింగ్ అక్టోబర్ 23తో ముగిసింది. మొదటి రోజు నుంచే జియో ఐపీఓకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అది చివరి రోజు నాటికి ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన దరఖాస్తులు సరికొత్త మైలురాయిని తాకాయి. గతంలో వారీ ఎనర్జీస్ ఐపీఓ పేరిట ఉన్న 97 లక్షల దరఖాస్తుల రికార్డును జియో ప్లాట్‌ఫామ్స్ బద్దలుకొట్టింది.    Also Read: జియో ఐపీఓ ప్రభంజనం - రెండో రోజే 3.47 రెట్ల సబ్‌స్క్రిప్షన్ - రూ. 3.5 లక్షల కోట్లు

జియో ఐపీఓ ముఖ్యాంశాలు 

  1. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ మొత్తం విలువ సుమారు రూ.30,213 కోట్లు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న అతిపెద్ద ఐపీఓ ఇదే కావడం గమనార్హం.   
  2. ఒక్కో షేరు ధరను రూ.1,065 నుండి రూ.1,119 మధ్య నిర్ణయించారు.   
  3. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఐపీఓ భారీ రెస్పాన్స్ అందుకుంటూ అంచనాలను మించిపోయింది. 
  4. జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్ట్ కానున్నాయి. లిస్టింగ్ రోజున ఈ షేర్లు ఏ రేంజ్‌లో ట్రేడ్ అవుతాయి, ఇన్వెస్టర్లకు ఎలాంటి లాభాలను అందిస్తాయి అనే దానిపై మార్కెట్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.    Also Read: రూ.30,213 కోట్ల జియో ఐపీఓ లైవ్.. సబ్‌స్క్రిప్షన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డ్
Continues below advertisement