Jio IPO Live: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చింది. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికాం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ (IPO) ఇవాళ ప్రారంభించింది. ఈ ఐపీఓ కు అక్టోబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు.  మొత్తం రూ.30,213 కోట్ల విలువైన ఈ ఆఫర్ ద్వారా, 2024లో హ్యుండాయ్ ఇండియా నమోదు చేసిన రూ.27,870 కోట్ల రికార్డును బ్రేక్ చేస్తూ భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచింది.

Continues below advertisement

మార్కెట్‌లో జియో ఆధిపత్యం

మెటా, గూగుల్, బ్లాక్‌రాక్, ఫిడిలిటీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వంటి ప్రపంచస్థాయి దిగ్గజాల మద్దతు జియో ప్లాట్‌ఫామ్స్‌కు ఉన్నాయి. 500 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లు దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న జియో, చైనా మొబైల్ తర్వాత రెండో అతిపెద్ద ఆపరేటర్‌గా రికార్డుకెక్కింది.  ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువను సుమారు 108.3 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అక్టోబర్ 28న స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయిన తర్వాత, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ కంపెనీల జాబితాలో నిలవనుంది.

గ్లోబల్ ఇన్వెస్టర్ల గ్రాండ్ ఎంట్రీ

ఈ ఐపీఓకు అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో ADIA, బ్లాక్‌రాక్ వంటి గ్లోబల్ ఫండ్‌లు సహా అనేక ప్రధాన సంస్థలు పోటీపడి రూ.25 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ విలువైన బిడ్లను దాఖలు చేశాయి.

Continues below advertisement

తొలి రోజే భారీగా బిడ్లు

ఐపీఓ ప్రారంభమైన మొదటి రోజే బిడ్డింగ్ రికార్డు స్థాయిలో సాగింది. 

QIB కోటా పూర్తి: అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (QIBs) కోసం కేటాయించిన లిస్ట్ లో మొదటి రోజు ఉదయం 10 గంటల సమయానికే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి, దాదాపు 2.86 రెట్ల డిమాండ్ సాధించింది. సాధారణంగా పెద్ద కంపెనీలు ఐపీఓ చివరి రోజున అప్లై చేస్తాయి. కానీ జియో విషయంలో తొలి రోజే భారీ స్పందన రావడం కంపెనీ బలమైన వ్యాపార నమూనాపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసానికి అద్దం పడుతోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. Also Read: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు

పెట్టుబడిదారులు గమనించాల్సిన విషయాలు 

 (Disclaimer : స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది. ఈ ఆర్టికల్ యూజర్ల అవగాహన కోసం మాత్రమే)