Jio Platforms IPO | జియో ప్లాట్‌ఫార్మ్స్ సంస్థ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) బుధవారం (అక్టోబర్ 21న) బిడ్డింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. భారతదేశంలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఐపీఓలలో ఇంత వేగంగా పూర్తిగా సబ్‌స్క్రిప్షన్ సాధించిన ఐపీఓగా నిలిచింది. బిడ్డింగ్ ప్రారంభమైన సుమారు 100 నిమిషాల్లోనే, ఉదయం 10:45 గంటల నాటికే ఆఫర్‌లో ఉన్న షేర్లలో 101 శాతం షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగత కొనుగోలుదారులు (QIBs) ఈ డిమాండ్‌లో కీలకంగా వ్యవహరించారు. వీరికి కేటాయించిన వాటాకు ఏకంగా 3.25 రెట్ల బిడ్లు నమోదయ్యాయి.

Continues below advertisement

భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ జియా ప్లాట్‌ఫారమ్స్‌కు చెందినది. ఇది పూర్తిగా కొత్త షేర్ల జారీ రూపంలోనే మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (OFS) కాంపోనెంట్ అనేది ఏదీ లేదు. సేకరించిన నిధులలో అధిక భాగాన్ని ప్రస్తుతం ఉన్న లోన్స్ తగ్గించుకోవడానికి వినియోగించాలని కంపెనీ భావిస్తోంది.

ప్రారంభంలో సంస్థాగత ఇన్వెస్టర్ల జోరు

Continues below advertisement

ఐపీఓ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లోనే QIB విభాగానికి సంబంధించిన కేటాయింపు పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. ఉదయం 10:45 గంటల నాటికి, సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు 3.25 రెట్ల డిమాండ్ వచ్చింది. అదే సమయానికి ఇతర కేటగిరీల ఇన్వెస్టర్ల భాగస్వామ్యం కొంత తక్కువగా ఉంది. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా 27 శాతం సబ్‌స్క్రైబ్ కాగా, రిటైల్ ఇన్వెస్టర్లు తమకు కేటాయించిన షేర్లలో ఆ సమయానికి 24 శాతం వరకు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

ఉద్యోగుల కోటాకి 59 శాతం బిడ్లు రాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నత వాటాదారుల కోసం కేటాయించిన విభాగంలో 45 శాతం సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. ఉదయం 10:45 గంటల సమయానికి ఉన్న డిమాండ్‌ను ఈ లెక్కలు ప్రతిబింబిస్తాయి. బిడ్డింగ్ కొనసాగుతున్న కొద్దీ ఇవి మారుతుంటాయి. 

లోన్స్ తగ్గింపుకే ఐపీఓ నిధులలో అధిక భాగం

జియో ప్లాట్‌ఫార్మ్స్ కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.30,213 కోట్లను సేకరిస్తోంది. OFS కాంపోనెంట్ లేని కారణంగా, ఈ నిధులన్నీ ప్రస్తుతం ఉన్న వాటాదారులకు కాకుండా నేరుగా కంపెనీకే చెందుతాయి. ఆ నిధులలో మెజారిటీ భాగాన్ని లోన్స్ తీర్చడానికి ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ నిధుల కేటాయింపు వల్ల కంపెనీ లోన్స్ తగ్గడం, ఇన్వెస్టర్లకు ఒక కీలకమైన అంశంగా మారింది. ప్రారంభంలోనే సంస్థాగత ఇన్వెస్టర్ల ప్రాధాన్యత కంపెనీ పబ్లిక్ మార్కెట్ అరంగేట్రంపై అందరి దృష్టిని ఆకర్షించాయి. 

 24 శాతం దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం (GMP)

ఈ నివేదిక సమయానికి జియో ప్లాట్‌ఫార్మ్స్ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. 268 వద్ద ఉంది. ఐపీఓ ధర Price Band ఒక్కో షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119 వరకు నిర్ణయించగా, గరిష్ట ధరపై ఇది దాదాపు 24 శాతం ప్రీమియంను సూచిస్తుంది. GMP అనేది అనధికారిక మార్కెట్ సూచిక. ఇది ఖచ్చితమైన లిస్టింగ్ ధరకు ఏ గ్యారెంటీ ఇవ్వదు. మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్ల డిమాండ్‌ను బట్టి లిస్టింగ్ ధర మారవచ్చు.

ఇతర ఐపీఓలను వెనక్కి నెట్టిన జియో ప్లాట్‌ఫార్మ్స్

నివేదికల ప్రకారం.. ఇతర ప్రధాన పబ్లిక్ ఇష్యూల కంటే జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ అత్యంత వేగంగా పూర్తి సబ్‌స్క్రిప్షన్ సాధించింది. గతంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.6,560 కోట్ల ఐపీఓ తొలిరోజు మధ్యాహ్నం 2 గంటలకి పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. దేశంలో అత్యధిక బిడ్లు పొందిన ఐపీఓగా నిలిచిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓ తొలిరోజు ముగిసే సమయానికి పూర్తిగా సబ్‌స్క్రిప్షన్ సాధించింది. కానీ కానీ జియో ప్లాట్‌ఫార్మ్స్ సుమారు 2 గంటల్లోనే ఈ మార్కు చేరి కొత్త రికార్డులు నమోదు చేసింది.చివరి సబ్‌స్క్రిప్షన్ వివరాలు, తదనంతర లిస్టింగ్ పనితీరు ఇన్వెస్టర్ల ఆసక్తిని మరింత స్పష్టంగా వెల్లడిస్తాయి.