Jio Financial Demerger: బిలియనీర్ ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) నుంచి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను డీమెర్జ్‌ చేసే ప్రాసెస్‌ స్పీడ్‌ అందుకుంది. తాజాగా, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విడదీయడానికి రికార్డ్‌ డేట్‌ నిర్ణయించారు.


రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ డీమెర్జర్‌కు రెగ్యులేటరీ అనుమతి గత నెలలోనే వచ్చింది. గత గురువారం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ డీమెర్జర్‌ కోసం రికార్డ్‌ తేదీగా ఈ నెల 20ని కంపెనీ బోర్డ్‌ ప్రకటించింది. 


రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను (RSIL) విడదీసిన తర్వాత, దాని పేరును 'జియో ఫైనాన్షియల్ సర్వీసెస్'గా (JFSL) మారుస్తారు, స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో JFSL షేర్లను లిస్ట్‌ చేయాలన్నది ప్రస్తుతం ఉన్న ప్లాన్‌.


1:1 రేషియోలో ఫ్రీ షేర్లు 
ఈ నెల 20వ తేదీ నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లను డీమ్యాట్‌ అకౌంట్లలో కలిగి ఉన్న షేర్‌హోల్డర్లకు, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ షేర్లు ఫ్రీగా లభిస్తాయి. RILలో హోల్డ్‌ చేస్తున్న ప్రతి ఒక షేర్‌కు ఒక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ షేర్‌ డీమ్యాట్‌ అకౌంట్‌లో యాడ్‌ అవుతుంది. ఇలా, ఎన్ని రిలయన్స్‌ షేర్లు ఉంటే అన్ని ఫైనాన్షియల్ షేర్లు ఉచితంగా లభిస్తాయి.


మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ రిలయన్స్‌. కంపెనీ విభజన & లిస్టింగ్‌ వల్ల, RILలో ప్రస్తుతం ఉన్న 36 లక్షల మంది షేర్‌హోల్డర్లకు వాల్యూ అన్‌లాక్ చేస్తుంది.


జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్‌ ప్రైస్‌ అంచనాలు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్‌ ప్రైస్‌కు సంబంధించి బ్రోకరేజ్ హౌస్‌ల అంచనాలను పరిశీలిస్తే... ఒక్కో షేరు ధర రూ. 189 ఉండవచ్చని JP మోర్గాన్ లెక్క వేసింది. జెఫరీస్ రూ. 179గా & సెంట్రమ్ బ్రోకింగ్ అంచనా ప్రకారం రూ. 157-190గా అంచనా వేసింది.


జేపీ మోర్గాన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్‌పై "ఓవర్‌వెయిట్‌" రేటింగ్‌తో, రూ. 2,960 టార్గెట్‌ ప్రైస్‌ ఇచ్చింది. 


శుక్రవారం (07 జులై 2023) సెషన్‌లో స్వల్పంగా తగ్గి రూ. 2,635.45 వద్ద ముగిసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌, ఇవాళ (10 జులై 2023) రూ. 2,686 దగ్గర ఓపెన్‌ అయింది. ఉదయం 10.25 గంటల సమయానికి 4.31% పెరిగి, రూ. 2,748.95 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.


గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ దాదాపు 11% పెరిగింది. గత మూడు నెలల్లో 13%, గత ఆరు నెలల్లో దాదాపు 8%, గత 12 నెలల్లో 13% పైగా ర్యాలీ చేసింది. 


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial