Silver adulteration like Gold | దీపావళి సీజన్‌కు కొన్ని రోజుల ముందు నుంచే మార్కెట్లలో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి.  అయితే ఇటీవల బంగారంలో కల్తీ, నకిలీ బంగారం విక్రయాల కేసులు నమోదవుతున్నాయి. పండుగల సమయంలో ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో ప్రజల్లో చాలా సందేహాలు నెలకొన్నాయి. పండుగల సందర్భాలలో బంగారంలాగే వెండిలో కూడా కల్తీ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కనుక ఈ రోజు మనం వెండిలో బంగారంలాగే ఎలా కల్తీ జరుగుతుంది, మీరు 100 గ్రాముల కాలి పట్టీ (Silver anklet)ని తయారు చేపిస్తే, అందులో ఎంత శాతం వెండి ఉంటుందో తెలుసుకుందాం.

Continues below advertisement

వెండిలో కల్తీ ఎలా జరుగుతుంది?

సాధారణంగా మార్కెట్లో లభించే వెండిలోనూ కొన్ని మిశ్రమాలను కలుపుతారు. దీనివల్ల ఆ వెండి నగ బరువు, మెరుపు అలాగే ఉంటాయి. అయితే కొందరు వ్యాపారులు ఖర్చు తగ్గించుకోవడానికి వెండి నాణ్యతను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అసలైన వెండిలో రాగి సరైన నిష్పత్తిలో ఉంటేనే అది హాల్‌మార్కింగ్‌కు అర్హత సాధిస్తుంది. ఆ వెండి స్వచ్ఛతను కాపాడుతుంది. అదే సమయంలో ఇతర లోహాలను కలపడం వల్ల వెండి నాణ్యత తగ్గుతుంది. అలాంటి ఆభరణాల రంగు త్వరగా పోతుంది. తక్కువ సమయంలోనే నగ అసలు స్వరూపం తెలుస్తుంది. 

Continues below advertisement

100 గ్రాముల పట్టీలో స్వచ్ఛమైన వెండి ఎంత ఉంటుంది?

వెండి ఆభరణాలు సాధారణంగా 92.5 శాతం స్వచ్ఛమైన వెండితో తయారు చేస్తారు. అంటే 100 గ్రాముల పట్టీలో 92.5 గ్రాముల స్వచ్ఛమైన వెండి ఉంటుంది. మిగిలిన భాగం ఇతర లోహాల మిశ్రమం కలుపుతారు. ఇవి ఆభరణాలను గట్టిగా, మన్నికగా చేస్తాయి. స్థానిక మార్కెట్లో చాలా మంది జ్యువెలర్లు 80 శాతం లేదా అంతకంటే తక్కువ స్వచ్ఛత కలిగిన వెండిని సైతం విక్రయియించే అవకాశముంది. దీనివల్ల కస్టమర్‌లు మోసపోయే అవకాశం ఉంది. కనుక కొనుగోలు చేసే ముందు హాల్‌మార్కింగ్‌ను చెక్ చేయాలి. 

కొనుగోలు సమయంలో అసలైన, నకిలీ వెండిని ఎలా గుర్తించాలి?

  • హాల్‌మార్క్ చూడండి - మీరు వెండిని కొనుగోలు చేయాలనుకుంటే, వెండిపై హాల్‌మార్క్ పరిశీలించండి. అసలైన వెండిపై 925 లేదా BIS మార్క్ ఖచ్చితంగా ఉంటుంది.
  • మంచుతో పరీక్ష - అసలైన వెండికి అధిక ఉష్ణ వాహకత ఉంటుంది. కనుక అసలైన వెండిపై మంచు ముక్క త్వరగా కరుగుతుంది. మీరు వెండిని మంచుపై ఉంచి కూడా పరీక్షించవచ్చు.
  • అయస్కాంతంతో పరీక్షించడం - నకిలీ వెండిని సాధారణంగా అయస్కాంతం ఆకర్షిస్తుంది. అదే విధంగా అసలైన వెండి అయస్కాంతానికి అంటుకోదు. మీరు వెండిని అయస్కాంతంతో కూడా పరీక్షించవచ్చు.
  • HUID కోడ్ చూడండి - బంగారంలాగే ఇప్పుడు వెండి ఆభరణాలపై కూడా 6 అంకెల HUID కోడ్ ఉంటుంది. కనుక మీరు వెండి ఆభరణాలపై కూడా ఆరు అంకెల HUID కోడ్‌ను గమనించవచ్చు. దీని ద్వారా ఆభరణాల స్వచ్ఛత ఏ హాల్‌మార్క్ ఉందో తెలుసుకోవచ్చు.

Also Read : Gold and Silver Price: ఏడాదిలో 50% పెరిగిన బంగారం ధర, ఇంకా పెరుగుతుందా? నిపుణులు ఏమన్నారో తెలుసుకోండి