LG Electronics IPO News Update: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ LG ఎలక్ట్రానిక్స్, త్వరలో ప్రారంభించనున్న IPO ‍‌(Initial Public Offering)కు మార్గం సుగమం అయింది. LG ఎలక్ట్రానిక్స్ IPOకు, స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (‍SEBI) ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, ప్రైమరీ మార్కెట్‌ నుంచి రూ. 15,000 కోట్లు సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తర్వాత, భారతదేశ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు రెడీ అయిన రెండో దక్షిణ కొరియా కంపెనీ LG ఎలక్ట్రానిక్స్. 


LG ఎలక్ట్రానిక్స్, తన IPO కోసం ఇప్పటికే రోడ్ షో (పెట్టుబడిదార్లను ఆకర్షించే కార్యక్రమాలు, సమావేశాలు వంటివి) ప్రారంభించింది. ఆ కంపెనీ, IPO కోసం ముంబైలో రోడ్ షో నిర్వహించింది & ఇతర నగరాల్లో కూడా ఈ తరహా కార్యక్రమాలను ప్లాన్‌ చేసింది. 


15 శాతం వాటా అమ్మకం
LG ఎలక్ట్రానిక్స్, ప్రతిపాదిత IPO ద్వారా, పెట్టుబడిదార్ల నుంచి 1.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 15,000 కోట్లు) వరకు సేకరించగలదు. ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌లో, దక్షిణ కొరియాలోని మాతృ సంస్థ 101.8 మిలియన్లకు పైగా షేర్లను విక్రయిస్తుంది, ఇది 15 శాతం వాటాకు సమానం. 


పూర్తిగా OFS రూట్‌లో IPO 
LG ఎలక్ట్రానిక్స్, గత ఏడాది డిసెంబర్‌లోనే SEBI వద్ద IPO ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ముసాయిదా పత్రాల ప్రకారం, దాని దక్షిణ కొరియా మాతృ సంస్థ LG ఎలక్ట్రానిక్స్ 10,18,15,859 ఈక్విటీ షేర్లను ‍‌(రూ.10 ముఖ విలువ) విక్రయిస్తుంది. IPOలోని అన్ని షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయిస్తారు & కంపెనీ ఒక్క తాజా షేర్‌ కూడా జారీ చేయడం లేదు. దీని అర్ధం - ఈ IPO ద్వారా LG ఎలక్ట్రానిక్స్ ఇండియాకు ఒక్క రూపాయి కూడా రాదు & సేకరించిన మొత్తం డబ్బు దక్షిణ కొరియాలోని మాతృ సంస్థకు వెళ్తుంది. 


భారతీయ స్టాక్ మార్కెట్‌లో LG ఎలక్ట్రానిక్స్‌ ఇండియాను లిస్ట్‌ చేయడం వల్ల కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ వ్యాపారానికి కొత్త ప్రోత్సాహం లభిస్తుంది. - LG ఎలక్ట్రానిక్స్ CEO విలియం చో


LG ఎలక్ట్రానిక్స్ ఇండియా IPO కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, JP మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ వంటి మర్చంట్ బ్యాంకర్లు పని చేస్తున్నాయి. IPO ద్వారా 13 బిలియన్‌ డాలర్ల విలువను సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.