Stock Market Opening Bell 17 October 2022: భారత స్టాక్‌ మార్కెట్లు ఇవాళ (సోమవారం) గ్యాప్‌ డౌన్‌లో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. BSE సెన్సెక్స్‌ 170, NSE నిఫ్టీ 41 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్‌ 10 నష్టంతో ఓపెన్‌ అయ్యాయి. శుక్రవారం సెషన్‌లో అమెరికన్‌ మార్కెట్లు 3 శాతం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆ ప్రభావం ఇవాళ మన మార్కెట్ల ఓపెనింగ్‌ మీద పడింది. మిగిలిన ఆసియా మార్కెట్ల నుంచి కూడా ఇవాళ ప్రతికూల సంకేతాలు అందాయి. యూరప్‌లో డీప్‌ రెసిషన్‌ తప్పదని గ్లోబల్‌ రీసెర్చ్‌ హౌస్‌ గోల్డ్‌మన్‌ సాచ్స్‌ రిపోర్ట్‌ చేసిన నేపథ్యంలో, భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం ఓపెన్‌ అయ్యే యూరోపియన్‌ మార్కెట్లలో ఫాల్‌ కనిపించే అవకాశం ఉంది. ఇవన్నీ కలిసి మన మార్కెట్‌ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. 


BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 57,919.97 పాయింట్ల  వద్ద ముగిసిన సెన్సెక్స్‌, ఇవాళ (సోమవారం) 170 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 57,752.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 10 గంటల సమయానికి 0.10 శాతం లేదా 59.54 పాయింట్ల నష్టంతో 57,860.43 వద్ద ఈ ఇండెక్స్‌ ట్రేడవుతోంది.


NSE Nifty
శుక్రవారం 17,185.70 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ, ఇవాళ 41 పాయింట్లు లేదా 0.24 శాతం నష్టంతో 17,144.80 పాయింట్ల వద్ద ఓపెనైంది. ఉదయం 10 గంటల సమయానికి 0.11 శాతం లేదా 18.30 పాయింట్ల నష్టంతో 17,167.40 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank
శుక్రవారం 39,305.60 పాయిట్ల వద్ద ముగిసిన బ్యాంక్‌ నిఫ్టీ, ఇవాళ 10 పాయింట్లు లేదా 0.03 శాతం నష్టంతో 39,295.60 పాయింట్ల వద్ద మొదలైంది. ఉదయం 10 గంటల సమయానికి 0.44 శాతం లేదా 172.70 పాయింట్ల లాభంతో 38,657.85 వద్ద ట్రేడవుతోంది.


Top Gainers and Lossers
మార్కెట్‌ ప్రారంభ సమయంలో... నిఫ్టీ 50లోని 21 కంపెనీలు లాభాల్లో ఉండగా, 27 కంపెనీలు నష్టాల్లో ఓపెన్‌ అయ్యాయి. మిగిలిన రెండూ న్యూట్రల్‌గా ఓపెన్‌ అయ్యాయి. ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో, ఇన్ఫీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, డా.రెడ్డీస్‌, హిందాల్కో టాప్‌ 5 గెయినర్స్‌గా ఉన్నాయి. ఎం&ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌&టీ, బీపీసీఎల్‌, హిందాల్కో టాప్‌ 5 లూజర్స్‌గా నష్టాలను భరిస్తున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1 శాతానికి పైగా నష్టపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.