Stock Market Closing Bell 17 October 2022: ఇవాళ (సోమవారం) మైనస్‌లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు ఫైనల్‌గా ప్లస్‌లో ఎండ్ అయ్యాయి. BSE సెన్సెక్స్ 491, NSE నిఫ్టీ 126 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 615 పాయింట్లు లాభపడ్డాయి. యూరప్‌లో డీప్ రెసిషన్ తప్పదని గ్లోబల్ రీసెర్చ్ హౌస్ గోల్డ్‌మన్ సాచ్స్ రిపోర్ట్ చేసినా, యూరోపియన్ మార్కెట్లు పచ్చగా కళకళలాడాయి. దీంతో మన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. మార్కెట్ ఒకే డైరెక్షన్‌లో మూవ్ అయింది.
BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 57,919.97 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, ఇవాళ (సోమవారం) 170 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 57,752.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 57,639.80 వద్ద ఇంట్రా డే కనిష్టాన్ని, 58,449.00 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది. రోజు ముగిసేసరికి 491 పాయింట్లు లేదా 0.85 శాతం లాభంతో 58,410.98 వద్ద ముగిసింది. కనిష్ట స్థాయి నుంచి లెక్కేస్తే మొత్తం 771 పాయింట్లు పుంజుకుంది.
NSE Nifty
శుక్రవారం 17,185.70 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ, ఇవాళ 41 పాయింట్లు లేదా 0.24 శాతం నష్టంతో 17,144.80 పాయింట్ల వద్ద ఓపెనైంది. 17,098.55 వద్ద ఇంట్రా డే కనిష్టాన్ని, 17,328.55 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది. చివరకు 126 పాయింట్లు లేదా 0.73 శాతం గెయిన్స్‌తో 17,311.80 వద్ద ముగిసింది. కీలకమైన 17,300 స్థాయిని దాటింది. ఇంట్రా డే కనిష్ట స్థాయి నుంచి ఈ ఇండెక్స్ 212 పాయింట్లు పుంజుకుంది.
Nifty Bank
శుక్రవారం 39,305.60 పాయిట్ల వద్ద ముగిసిన బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ 10 పాయింట్లు లేదా 0.03 శాతం నష్టంతో 39,295.60 పాయింట్ల వద్ద మొదలైంది. 39,146.70 వద్ద ఇంట్రా డే కనిష్టాన్ని, 39,974.70 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది.
క్లోజింగ్ బెల్ సమయానికి 614 పాయింట్లు లేదా 1.56 లాభపడి 39,920.45 వద్ద ముగిసింది. ఇంట్రా డే కనిష్ట స్థాయి నుంచి చూస్తే మొత్తం 773 పాయింట్లు పుంజుకుంది.
Top Gainers and Lossers
మార్కెట్ ప్రారంభ సమయంలో... నిఫ్టీ 50లోని 21 కంపెనీలు లాభాల్లో ఉండగా, 27 కంపెనీలు నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. మిగిలిన రెండూ న్యూట్రల్‌గా ఓపెన్ అయ్యాయి. క్లోజింగ్ సమయానికి 37 కంపెనీలు లాభంలో ఉండగా, 13 కంపెనీలు నష్టంలో ఉన్నాయి. ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సెర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీసీపీ, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ 5 గెయినర్స్‌గా ఉన్నాయి. హిందాల్కో, ఎల్&టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా టాప్ 5 లూజర్స్‌గా నష్టాలను మూటగట్టుకున్నాయి. సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 3.4 శాతం లాభపడగా, నిఫ్టీ మెటల్ 1 శాతం వరకు నష్టపోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.