Starbucks New CEO: ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవికి సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, అడోబ్ ఐఎన్ సీ ఛైర్మన్ గా షాంతను నారాయణ్, ట్విట్టర్ సీఈఓఘా పరాగ్ అగర్వాల్ నియమితులైన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా స్టార్ బక్స్ కు సీఈఓగా భారత సంతతి వ్యక్తి లక్ష్మన్ నరసింహన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్టార్ బక్స్ ప్రకటించింది. లక్ష్మన్ నరసింహన్ కంపెనీకి సీఈఓగానే కాకుండా బోర్ట్ ఆఫ్ డైరెక్టర్ లో సభ్యుడిగాను ఉంటారని తెలిపింది. అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆయన బాధ్యతలు స్వకరించబోతున్నారు. 


నరసింహన్ కు కొన్నాళ్లు సాయం చేయనున్న హోవర్డ్..


ప్రస్తుతం స్టార్ బక్స్ సీఈఓగా ఉన్న హోవర్ట్ షుల్టజ్ స్థానంలోకి లక్ష్మణ్ నరసింహన్ వెళ్లనున్నారు. 2023 ఏప్రిల్ వరకు హోవర్డ్ స్టార్ బక్స్ తాత్కాలిక సీఈఓగా వ్యవహించనున్నారు. అయితే 55 ఏళ్ల నరసింహన్ బ్రిటన్ కు చెందిన రెకిట్ బెంకిజర్ అనే బహుళజాతి కంపెనీకి సీఈఓగా పని చేసారు. సెప్టెంబర్ 30న రెకిట్ బెంకిజర్ కంపెనీ సీఈఓ బాధ్యతన నుంచి లక్ష్మణ్ సరసింహన్ వైదొలిగనట్లు సదరు సంస్థ తెలిపింది. అయితే ఈ విషయం స్పందించిన నరసింహన్.."అమెరికాకు తిరిగి రావడానికి నాకు అవకాశం లభించింది. లండన్ ను విడిచి పెట్టి రావడం చాలా కష్టమే అయినప్పటికీ.. కుటుంబం కోసం కఠిన నిర్ణయం తీసుకుంటున్నాను" అని తెలిపారు.  


మున్ముందు సవాళ్లను ఎదుర్కోబోతున్నారా..?


భారతీయ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ చైన్ అయిన స్టార్ బక్స్ తన మెనూలో మసాలా చాయ్ అలాగే ఫిల్టర్ కాఫీని అప్ డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సీజన్ ను బట్టి, డిమాండ్ ను బట్టి రెస్టారెంట్ మెనూల్లో మార్పులు, చేర్పులు చేయడం మార్కెటింగ్ ట్రిక్. మన భారతీయులకు క్యాపిచ్చినో, లాట్టే ఫ్లేవర్ల కంటే మసాలా చాయ్, ఇరానీ చాయ్ సాధారణ కాఫీలే ఇష్టం. ఈ ఇష్టాన్ని చాలా ఆలస్యంగా గ్రహించిన స్టార్ బక్స్ వీటిని కూడా తమ మెనూలో చేర్చబోతుంది. ఈ విషయం అందరికీ తెలిసేలా #ItStartsWithYourName అనే హ్యాష్ టాగ్ తో ప్రచారం కూడా ప్రారంభించింది. ఇదులో బాగంగా కాఫీ కప్పులపై వినియోగదారుల పేర్లను రాసి వారి కోరిన కాఫీ లేదా టీ ఫ్లేవర్లను అందించనున్నారు. కొత్త మెనూలో చాక్లెట్ టీ, వెనీలా టీ, స్ట్రాబెరీ టీలతో పాటు క్లాసిక్ మసాలా ఛాయ్, ఇలాచీ చాయ్, సౌత్ ఉండియ్ ఫిల్టర్ కాఫీ ఉంటాయి. ఫిల్టర్ కాఫీ ధరలు రూ. 190 నుంచి ప్రారంభం అవుతుండగా.. మిల్క్ షేక్ ల ధరలు రూ.275 నుంచి ప్రారంభం అవుతున్నాయి. 


అయితే ప్రస్తుతం స్టార్ బక్స్ కల్లోలాన్ని ఎదుర్కుంటోంది. ఆ సంస్థ పరిస్థితి అంత మెరుగ్గా లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో ఆ సంస్థలో పని చేసే కార్మికులు తమకు మెరుగైన ప్రయోజనాలు, వేతనాలు కల్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్ అనేక సవాళ్లను ఎదుర్కోబోతున్నారు.