Stock Market News | ప్రస్తుతం ఇండియాలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది.  ఐదు నెలలుగా స్టాక్ మార్కెట్ వరుసగా నష్టాల్లో కొనసాగుతూ వస్తుంది. గత 29 ఏళ్లలో ఇలా వరుసగా స్టాక్ మార్కెట్ పడిపోతూ రావడం అనే పరిస్థితి లేదు అంటున్నారు నిపుణులు. 


స్థాయికి మించి పెంచిన స్థాక్స్ వేల్యూ దీనికి కారణం 


మార్కెట్ నిపుణులు, సెబీ చీఫ్ సైతం చాలా స్టాక్స్ ని వాటి స్థాయికి మించి అమ్ముతున్నారు అలాగే కొనుగోలు చేస్తున్నారు. ఇది ఒక గాలి బుడగ లాంటిది ఎక్కువ కాలం ఇది కొనసాగదు అని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ బబుల్ పేలడంతో  స్టాక్స్ పడిపోతున్నాయి అనేది ఒక అంచనా. ఇప్పటికే చాలా స్టాక్స్ అట్టడుగు స్థాయికి చేరుకోగా ఇంకా పతనం అయ్యే ఛాన్స్ ఉంటుందనేది మరికొందరి అభిప్రాయం. స్టాక్ మార్కెట్ వైపు మధ్యతరగతి ప్రజలు సైతం ఆకర్షితులయ్యలా గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారాల వల్ల విపరీతంగా కొనుగోళ్లు జరగడాలు ఇప్పుడు ప్రపంచ పరిణామాల దృష్ట్యా  ఇన్వెస్టర్స్ లో భయం చేకూరడంతో  ఇప్పుడు గతంలో మాదిరి కొనుగోళ్లు అమ్మకాలు ఆగిపోవడం తో స్టాక్ మార్కెట్ పతనవుతుందని అంటున్నారు. 


డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ 


అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రెండోసారి ఎన్నికైనప్పటినుంచి తీసుకుంటున్న విపరీత నిర్ణయాలు ఇన్వెస్టర్స్ లో భయాన్ని పెంచుతున్నాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రపంచ స్టాక్ మార్కెట్స్ పై ప్రభావం చూపించే అమెరికా దేశ అధ్యక్షుడి హోదాలో వేరే దేశాలమతి దిగుమతులపై రోజుకో విధంగా టారిఫ్ లు ఆంక్షలు విధిస్తానంటూ చేస్తున్న ప్రకటనలు విదేశి ఇన్వెస్టర్లలో అయోమయాన్ని కలిగిస్తున్నాయి. దానితో వాళ్లు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 12 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టబడులు వెనక్కి వెళ్లిపోయాయని కథనాలు వెలుతున్నాయి. వాటిలో అధిక భాగం ఐటీ సెక్టర్ నుండే.


ట్రంప్ ప్రస్తుతం  జియో పాలిటిక్స్ స్వరూపమే మార్చేస్తున్నారు. ఏ రోజు ఏ దేశాన్ని పొగుడుతారో ఏ ఏ రోజు ఏ దేశాన్ని తిడతారో మదుపర్లకు అర్థం కావడం లేదు. ఆ వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వచ్చేవరకూ మార్కెట్స్ పై ఈ ప్రభావం కొనసాగక తప్పదని నిపుణులు చెబుతున్నారు. దీనితో  స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇన్ మిస్టర్ స్లో ఒక విధమైన పానిక్ క్రియేట్ కావడంతో  దాని ప్రభావం స్టాక్స్ పై ఎక్కువగా పడుతోంది 


చైనా ఎఫెక్ట్  
కొంతకాలంగా ఇండియన్ స్టాక్స్ విలువ భారీగా పెరుగుతూ ఉంటే మరోవైపు చైనా స్టాక్స్ ఇన్వెస్టర్స్ కు అందుబాటులో ఉంటూ వచ్చింది. పైగా ఇన్వెస్టర్స్ ను ఆకర్షించడానికి చైనా ప్రభుత్వం రకరకాల తాయిలాలు ప్రకటిస్తూ వచ్చింది. దానితో ఇండియన్ స్టాక్ మార్కెట్లో  పెట్టాల్సిన పెట్టుబడులను  విదేశీ ఇన్వెస్టర్స్  చైనా లో పెడుతున్నారని మరికొన్ని కథనాలు విలువడుతున్నాయి. దీనినే మార్కెట్ పరిభాష లో " Sell india buy china " అంటూ ట్రెండ్ చేస్తున్నారు. 


ఊరటనిస్తున్న పెరురుగుతున్న ఇండియన్ జీడీపీ రేట్
అయితే ప్రస్తుతం ఇండియన్ జిడిపి రేట్ పెరగడం ఊరటనిస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ రిలీట్ చేసిన గణాంకాల ప్రకారం  2024 లో అక్టోబర్ - డిసెంబర్ మధ్య  జిడిపిలో పెరుగుదల కనిపించింది. ఆ మూడు నెలల్లో జీడీపీ రేట్ 6.2% గా ఉంది. అంతకు ముందు అంతే ఆగస్టు - సెప్టెంబర్ మధ్య ఇది 5.4% మాత్రమే ఉంది. ఇక జనవరి -మార్చి 2025 లో 7% దాటుతుంది అని అంచనా వేస్తున్నారు.ఇది భారతీయ స్టాక్ మార్కెట్లపై  మంచి ప్రభావాన్నే చూపించే అవకాశం ఉంది. జిడిపి వృద్ది రేటు, పారిశ్రామిక రంగంలో లాభాలు ప్రధానంగా ఇవే స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపిస్తాయి.  అలాగే దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అదృష్టవశాత్తూ కుంభమేళా దీనికి కలిసి వచ్చింది. భారత ఆర్థిక సలహాదారు  అనంత నాగేశ్వరన్ ప్రకారం 50 కోట్ల మందికి పైగా ప్రజలు కుంభమేళాను దర్శించారు. అ సమయంలో వారు చేసిన ఖర్చు టిడిపి పై మంచి ప్రభావం చూపించింది అంటున్నారు.  


అక్టోబర్ -డిసెంబర్ 2024 మధ్య ప్రజలు మార్కెట్లో ఖర్చు చేసే శాతం కూడా 6.9% కు పెరిగింది. ఇది ఒక శుభ పరిమాణం.గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా పెరగడం దానికి కలిసి వచ్చింది. ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థ త్వరలో  కోలు కుంటుందన్న సంకేతాన్ని ఇస్తున్నాయి. అదే జరిగితే మళ్లీ స్టాక్స్ లో పెట్టుబడులు పెరుగుతాయి. ఈ పరిణామాలు త్వరగా జరగాలని స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టిన మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.