IT Returns 2025 | న్యూఢిల్లీ: భారత్‌లో ట్యాక్స్ పేయర్లకు ముఖ్య గమనిక. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయడానికి తుది గడువు సెప్టెంబర్ 15, 2025తో ముగియనుంది. కనుక ఇంకా ఐటీఆర్ దాఖలు చేయని వారు ఐటీఆర్‌ (Income Tax Returns)ను సోమవారం వరకు దాఖలు చేయాలి. సెప్టెంబర్ 15 లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే, ట్యాక్స్ పేయర్లు రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు.

Continues below advertisement

సెప్టెంబర్ 15తో ముగియనున్న తుది గడువు

ఐటీఆర్ దాఖలు (ITR) చేయడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. పన్ను చెల్లింపుదారులు రేపటి వరకు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంటే అసెస్‌మెంట్ సంవత్సరం 2025-26కి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 వరకు పన్ను చెల్లింపుదారులకు గడువు ఇచ్చింది. గతంలో, ఐటీఆర్ దాఖలు చేయడానికి ఎలాంటి జరిమానా లేకుండా తుది గడువు జూలై 31 వరకు ఉంది.ఈ సంవత్సరం, ఐటీఆర్ ఫారమ్‌లో చేసిన కొన్ని సవరణల కారణంగా గడువును నెలన్నర రోజులపాటు పొడిగించారు. ఐటీఆర్ ఫారమ్‌ను నవీకరించడానికి, ఫైలింగ్ సిస్టమ్‌లో అవసరమైన మార్పులు, టీడీఎస్ క్రెడిట్ రిఫ్లెక్ట్ కావడంలో జాప్యం లేకుండా చేయడానికి ముఖ్యమైన మార్పులు చేశారు.

Continues below advertisement

గరిష్టంగా జరిమానా రూ.5000

ఐటీఆర్ విభాగం నిర్ణయించిన గడువు తేదీలోపు ఐటీఆర్‌ (IT Retuns)ను దాఖలు చేయాలి. ఇచ్చిన సమయంలోపు పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం జరిమానా చెల్లించక తప్పదు. గరిష్టంగా జరిమానా రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది. రూ. 500000 లక్షల వరకు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు రూ.5 వేలు ఫైన్ కట్టాలి. రూ. 50000 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్లు రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

జరిమానాతో పాటు జైలుశిక్షకు అవకాశం

ఐటీఆర్ దాఖలు చేయడంలో జాప్యం జరిమానాలు మాత్రమే కాకుండా ఇతర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరిగ్గా పన్ను చెల్లించని వారిపై నిరంతరం నిఘా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే నిబంధన ఉంది. కొన్ని సందర్భాలలో 3 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

నివేదిక ప్రకారం, ఐటీఆర్ దాఖలు చేయడానికి ఇచ్చిన సెప్టెంబర్ 15 తేదీలో ఎటువంటి మార్పు లేదు. అయితే, జరిమానాతో ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేయడానికి తుది గడువు డిసెంబర్ 31, 2025. ఆదాయపు పన్ను శాఖ శనివారం తెలిపిన సమాచారం ప్రకారం, 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేశారు.