Paytm FASTag: పేటీఎమ్‌కి మరో షాక్ తగిలింది. ఇకపై పేటీఎమ్ ద్వారా ఫాస్టాగ్‌లు జారీ చేయొద్దని IHMCL ఆదేశాలు జారీ చేసింది. పేటీఎమ్ నుంచి ఫాస్టాగ్‌ని తొలగించాలని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ ఈ సర్వీస్‌లు అందించేందుకు పేటీఎమ్‌కి అవకాశమిచ్చిన సంస్థ ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించింది. టాప్‌అప్స్,డిపాజిట్స్‌ స్వీకరించకూడదని ఆదేశించింది. IHMCL పరిధిలో మొత్తం 32 బ్యాంకులున్నాయి. వీటి ద్వారా ఫాస్టాగ్‌ జారీ చేసేందుకు అవకాశముంది. ఇప్పుడీ జాబితాలో పేటీఎమ్ కనిపించదు. ఈ 32 బ్యాంకులలో  Allahabad Bank, Airtel Payments Bank, ICICI Bank, HDFC Bank, SBI తదితర బ్యాంకులున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి 8 కోట్ల మంది ఫాస్టాగ్ యూజర్స్ ఉన్నారని, అందులో Paytm Payments Bank (PPBL) మార్కెట్ షేర్ 30% మేర ఉందని NHAI అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 19వ తేదీనే పేటీఎమ్ కొత్తగా ఫాస్టాగ్‌లూ జారీ చేయొద్దని ఆంక్షలు విధించింది Indian Highways Management Company Ltd. 






ఇప్పటికే పేటీఎమ్ ద్వారా ఫాస్టాగ్‌లు తీసుకున్న వాళ్లు వెంటనే మార్చుకోవాలని ఆదేశించింది. RBI నింబధనల మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఫాస్టాగ్ వినియోగదారులంతా మరోసారి KYC ప్రక్రియను RBI గైడ్‌లైన్స్ ప్రకారం పూర్తి చేయాలని తెలిపింది. 


"ఇకపై పేటీఎమ్‌ ద్వారా ఫాస్టాగ్‌లో డిపాజిట్‌లు, టాప్‌అప్స్ చేయడానికి వీల్లేదు. ఫిబ్రవరి 29 తరవాత నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రీఫండ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు త్వరలోనే క్రెడిట్ అవుతాయి"


- IHMCL


పేటీఎమ్ సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌లోని లోపాలను చాలా స్పష్టంగా వెల్లడించింది. ఆ తప్పుల్ని సరిదిద్దుకోడానికి సరిపడా సమయం ఇచ్చినా కంపెనీ పట్టించుకోలేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది. Paytm Payments Bank కేసులో విచారణ మొదలు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమపై ఈడీ విచారణ ఏమీ జరగడం లేదని పేటీఎమ్ స్పష్టం చేసినప్పటికీ...ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైనట్టు సమాచారం. ఈ సంక్షోభం కారణంగా...Paytm షేర్స్‌ ఒక్కరోజులోనే 9% మేర పడిపోయాయి. ఇప్పటికే RBI ఆంక్షలతో సతమతం అవుతున్న పేటీఎమ్ ఇప్పుడు ఈడీ విచారణతో మరింత క్రెడిబిలిటీ కోల్పోనుంది. జనవరి 31వ తేదీన RBI ఈ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎమ్‌ వాల్యూ దాదాపు 60% మేర పడిపోయింది. అంటే దాదాపు 2.6 బిలియన్ డాలర్ల మేర సంపదను కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికే RBI ఉన్నతాధికారులతో ఓ సారి భేటీ అయ్యారు శేఖర్ శర్మ. అయితే...ఆంక్షలు ఎత్తివేస్తామన్న భరోసా మాత్రం RBI ఇవ్వలేదు. అందుకే....నేరుగా ఆర్థిక మంత్రినే కలవాలని సీఈవో భావించినట్టు తెలుస్తోంది. అటు ఈడీ కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్ధమైంది.


Also Read: Karnataka Budget 2024: కర్ణాటక బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన సీఎం సిద్దరామయ్య, పద్దులోని హైలైట్స్ ఇవే