Patanjali Ayurved News:  పతంజలి ఆయుర్వేదం సాంప్రదాయ ఆయుర్వేద విధానాన్ని సంరక్షించడంతో పాటు దానిని ఆధునీకరించడంలో విప్లవాత్మక పాత్ర పోషించింది. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ నాయకత్వంలో పతంజలి ఆయుర్వేద ఔషధాలు   శాస్త్రీయంగా నిరూపితమయ్చాయి. అరుదైన మూలికల సంరక్షణతో పాటు, పతంజలి కంపెనీ వాటిని మాత్రలు, సిరప్‌ల వంటి ఆధునిక రూపాల్లో అందుబాటులోకి తెచ్చింది.

పతంజలి పరిశోధనా సంస్థ ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్య పద్ధతులతో అనుసంధానం చేసింది. యోగా, ఆయుర్వేదం అనేవి కలపడం ద్వారా దీనికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ చొరవతో సాంప్రదాయ వైద్య విధానాన్ని కాపాడటమే కాకుండా కొత్త తరానికి అత్యాధునికంగా ఆయుర్వేదం అందుబాటులోకి తెచ్చింది.

పతంజలి కీలకపాత్రపతంజలి సంస్థ ఆయుర్వేద ఉత్పత్తులను భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యంలోకి తెచ్చింది. అశ్వగంధ, త్రిఫలాలను మాత్రలుగా అందుబాటులో ఉంచడంతో పాటు ఆధునికంగా ఆ ఆయుర్వేద ఔషధాలను కంపెనీ మార్కెట్ చేసి విజయం సాధించింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను శాస్త్రీయంగా పరీక్షలు చేసి ధృవీకరించడం ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది. ఆయుర్వేద ఉత్పత్తుల నాణ్యత, వాటి ప్రభావాన్ని నిర్ధారించడానికి కంపెనీ రీసెర్చ్,  అభివృద్ధిపై కూడా ఫోకస్ చేసింది.

రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్.. పతంజలి పరిశోధనా సంస్థ ఆయుర్వేద ఉత్పత్తులపై, ఔషధ మొక్కలపై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించింది. ఈ సంస్థ ఆయుర్వేద ఔషధాలను అత్యాధునిక వైద్య పద్ధతులతో కనెక్ట్ చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని పెంచడానికి కృషి చేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రభావంయోగా, ఆయుర్వేదం అభ్యాసానికి పతంజలి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కల్పించింది. బాబా రామ్‌దేవ్ యోగా కేందరాలు, ఆయన టీవీ కార్యక్రమాలు లక్షలాది మందిని సహజమైన  జీవితాన్ని గడపడానికి ప్రేరణ ఇచ్చాయి. ఆధునిక రోజుల్లో ఎంతో ప్రసిద్ధమైన ఆయుర్వేదాన్ని పునరుద్ధరించడంతో పాటు దానిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో పతంజలి కీలక పాత్ర పోషించింది. పతంజలి కృషితో భారతదేశంలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా  ఆయుర్వేద వైద్య విధానం, ఆయుర్వేద ఉత్పత్తులకు మంచి గుర్తింపును ఇచ్చాయి.