List of Items Getting Costlier From September 22 | హైదరాబాద్: నవరాత్రి తొలి రోజు సెప్టెంబర్ 22నుంచి చాలా ఉత్పత్తులపై ధరలు తగ్గనున్నాయి. అయితే GST కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయం కారణంగా కొన్ని లగ్జరీ వస్తువులు, పొగాకు ఉత్పత్తులు, ఆల్కాహాల్ పై భారీ పన్ను (40% జీఎస్టీ) అమలులోకి వస్తుంది. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా లగ్జరీ వస్తువులు, ఆల్కాహాల్, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ 40 శాతం వసూలు చేయనుండంతో అవి మరింత ఖరీదు కానున్నాయి. పరిహార సెస్ విధానాన్ని పూర్తిగా తొలగించిన తరువాత త్వరలో వాటిపై ధరలు పెరగనున్నాయి. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటాల కోసం తీసుకున్న రుణాల చెల్లింపులు పూర్తయ్యాక పాన్ మసాలా, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై లగ్జరీ ట్యాక్స్ స్లాబ్ అమలు చేయనున్నారు.
40% GST స్లాబ్ ఎవరి మీద ప్రభావం చూపుతుంది?ఇటీవల GST కౌన్సిల్ తీసుకున్న ఈ కొత్త 40% ట్యాక్స్ స్లాబ్ ముఖ్యంగా లగ్జరీ వస్తువులు, ఫ్యాన్సీ వాహనాలు, సిగరెట్, గుట్కా వంటి సిన్ గూడ్స్ కు వర్తించనుంది.
సెప్టెంబర్ 22 నుంచి 40% GST వర్తించే వస్తువులు, ఉత్పత్తులు- ఎరేటెడ్ వాటర్- కార్బొనేటెడ్ డ్రింక్స్- కెఫిన్ కలిగిన పానీయాలు- మద్యరహిత (Non-Alcoholic) ఫ్లేవర్‌డ్ డ్రింక్స్- సాఫ్ట్ డ్రింక్స్- ఎనర్జీ డ్రింక్స్- 1200cc పైగా ఇంజిన్ సామర్థ్యం గల కార్లు, 4000mm కంటే పొడవైన కార్లు- 350cc పైగా ఇంజిన్ సామర్థ్యం గల మోటార్‌సైకిళ్లు- వ్యక్తిగత వినియోగానికి యాచులు (Yachts)- వ్యక్తిగత అవసరాలకు ప్రైవేట్ విమానాలు- వ్యక్తిగత అవసరాలకు వినియోగించే రేసింగ్ కార్లు
భవిష్యత్తులో 40% GST వర్తించే ఉత్పత్తులు ఇవే (లోన్ రీపేమెంట్ తరువాత)- పాన్ మసాలా- గుట్కా- చూయింగ్ టొబాకో- సిగరెట్లు- జర్దా- ముడి పొగాకు- బీడీలు
నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని GST కౌన్సిల్ ఇటీవల పొగాకు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై 40% జీఎస్టీ విధించగా.. నిర్ణయం అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. COVID-19 సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పన్ను నష్టాలు భర్తీ చేసేందుకు తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు పూర్తయ్యేవరకు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ విధానమే కొనసాగనుంది.
పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంపు ఎప్పుడంటే ?టొబాకో సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం GST ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో ఇంకా తేదీని ప్రకటించలేదు. కరోనా సమయంలో తీసుకున్న రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాతే వీటిపై లగ్జరీ వస్తువులపై విధించే జీఎస్టీ స్లాబ్ అమలు చేయనున్నారు.
సెప్టెంబర్ 22 నుంచి లగ్జరీ కార్లు, కొన్ని రకాల మోటార్ సైకిళ్లు, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, యాచులు, ప్రైవేట్ విమానాలు ధరలు పెరుగుతాయి. పాన్ మసాలా, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40% GST కేంద్రం రుణాలు తిరిగి చెల్లించిన తరువాత అమలు చేస్తారు. ఈ కొత్త పన్ను విధానంతో పలు లగ్జరీ, వినోద ఉత్పత్తుల కోసం వినియోగదారులకు అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. పాలు, దుస్తులు, పలు రకాల ఆహార పదార్థాలపై జీఎస్టీ తగ్గింపుతో ధరలు దిగిరానున్నాయి.