Hatsun Agro Product Rights Issue: ఇప్పటికే ₹ 301 కోట్ల రైట్స్‌ ఇష్యూని ప్రకటించిన హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌, ఈ ఇష్యూకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మార్కెట్‌లోకి వదిలింది. షేర్‌హోల్డర్ల అర్హతను నిర్ణయించడానికి, ఈ ప్రయోజనాన్ని అందుకోవడానికి రికార్డ్ డేట్‌ను, ఎన్‌టైటిల్‌మెంట్‌ రేషియోను నిర్ణయించింది. వీటన్నింటికీ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది.


ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) విభాగంలో హట్సన్‌ ఆగ్రో బిజినెస్‌ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్‌ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్‌) ₹ 20,759.83 కోట్లు.


రైట్స్‌ ఇష్యూ అప్‌డేట్స్‌


a. మొత్తం ఈక్విటీ షేర్లు, రైట్స్‌ ఇష్యూ సైజ్‌: 71,85,444 ఫుల్లీ పెయిడప్‌ ఈక్విటీ షేర్లను రైట్స్‌ ద్వారా షేర్‌హోల్డర్లకు అందుబాటులోకి తెస్తుంది. దీని ద్వారా మొత్తం రూ. 301,07,01,036 సమీకరిస్తుంది.


b. రైట్స్ ఇష్యూ ధర: ఈక్విటీ షేర్‌ను రూ. 419కు ( ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 418 ప్రీమియం సహా) కేటాయిస్తుంది.


c. రికార్డ్ తేదీ: గురువారం, 8 డిసెంబర్ 2022. రైట్స్‌ ఇష్యూకు అర్హత సాధించాలంటే ఈ తేదీ నాటికి మీ డీమ్యాట్‌ అకౌంట్‌లో కంపెనీ షేర్లు ఉండాలి. 


d. రైట్స్‌ ఇష్యూ పిరియడ్‌: ప్రారంభ తేదీ - సోమవారం, 19 డిసెంబర్ 2022; ముగింపు తేదీ - సోమవారం, 9 జనవరి 2023


e. ఔట్‌ స్టాండింగ్‌ ఈక్విటీ షేర్లు: రైట్స్‌ ఇష్యూకు ముందు - 21,55,63,323; రైట్స్‌ ఇష్యూ తర్వాత - 22,27,48,767 (71,85,444 షేర్లు పెరుగుతాయి)


f. రైట్స్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌ రేషియో: 1:30 (ప్రతి 30 ఈక్విటీ షేర్లకు ఒక రైట్స్‌ షేర్‌). రైట్స్‌ ఇష్యూలో పాల్గొనాలంటే, రికార్డ్‌ తేదీ నాటికి కనీసం 30 ఈక్విటీ షేర్లుమీ డీమ్యాట్‌ అకౌంట్‌లో ఉండాలి. షేర్‌ హోల్డర్ల దగ్గరున్న ప్రతి 30 ఈక్విటీ షేర్లకు ఒక రైట్స్‌ ఈక్విటీ షేర్‌ను కంపెనీ ఆఫర్‌ చేస్తుంది.


రైట్స్‌ ఇష్యూకు కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలపడంతో, హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం నాటి అస్థిర మార్కెట్‌లోనూ లాభపడ్డాయి. 1.85% పెరిగి ఒక్కో షేరు ₹ 963 వద్ద ముగిసింది. గత 20 రోజుల సగటు వాల్యూమ్ 75,996 షేర్లతో పోలిస్తే సోమవారం ఒక్క రోజే ఈ స్టాక్‌ 81,412 షేర్ల వాల్యూమ్‌ను నమోదు చేసింది. 


ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD), ఈ కౌంటర్‌ 23.70% పడిపోయింది. 09 డిసెంబర్ 2021న స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి ₹ 1,394 ను; 17 జూన్‌ 2022న 52 వారాల కనిష్ట స్థాయి ₹ 837.60 ను ఈ కౌంటర్‌ క్రియేట్‌ చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.