Flipkart To Offer Loans To Customers:  ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి లెండింగ్ లైసెన్స్‌ను పొందింది.  దీని ద్వారా కస్టమర్‌లు.  విక్రేతలకు నేరుగా తన ప్లాట్‌ఫామ్‌పై రుణాలు అందించడానికి అనుమతి లభించినట్లయింది.  దేశంలోని ఒక పెద్ద ఈ-కామర్స్ సంస్థకు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) లైసెన్స్‌ను RBI మంజూరు చేయడం ఇదే మొదటిసారి అని వార్తా సంస్థ రాయిటర్స్  తెలిపింది.  ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు బ్యాంకులు , NBFCలతో టైఅప్‌లలో రుణాలను ఇప్పటికే అందిస్తున్నాయి. అయితే నేరుగా   ఫ్లిప్‌కార్ట్   రుణాలు ఇవ్వడానికి లైసెన్స్ వచ్చింది. దీని  ద్వారా ఫ్లిప్ కార్టు వడ్డీ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లవుతుంది.  RBI ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు డిపాజిట్లు తీసుకోవడానికి కాకుండా రుణాలు మాత్రమే అందించడానికి అనుమతినిచ్చింది. అంటే డిపాజిట్లు కూడా తీసుకుంటుంది.  

ఫ్లిప్‌కార్ట్ 2022లో ఈ NBFC లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది,  మార్చి 13, 2025న RBI నుండి అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందింది. రుణ కార్యకలాపాలు “కొన్ని నెలల్లో” ప్రారంభమవుతాయని, అంతర్గత ప్రక్రియలు, కీలక నిర్వాహక సిబ్బంది నియామకం,   బోర్డ్ సభ్యుల నియామకం పూర్తయిన తరవాత వడ్డీ వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. 

ఫ్లిప్‌కార్ట్  ప్రస్తుతం వాల్‌మార్ట్  యాజమాన్యంలో ఉంది.   2018లో, వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 77 శాతం వాటాను  16 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది.  దీనితో ఫ్లిప్‌కార్ .. వాల్ మార్ట్ నియంత్రణలోకి వచ్చింది. ‌ 2024లో  ఫ్లిప్‌కార్ట్ విలువ  37 బిలియన డాలర్లుగా అంచనా వేశారు.  ఫ్లిప్‌కార్ట్‌ను 2007లో సచిన్ బన్సల్ , బిన్నీ బన్సల్  స్థాపించారు. వారు ఇద్దరూ ఐఐటీ దిల్లీ గ్రాడ్యుయేట్లు .  మాజీ అమెజాన్ ఉద్యోగులు. 2018లో వాల్‌మార్ట్ స్వాధీనం తర్వాత, సచిన్ బన్సల్ కంపెనీ నుండి నిష్క్రమించారు.  బిన్నీ బన్సల్ కొంతకాలం బోర్డులో కొనసాగారు. వాల్‌మార్ట్  వద్ద 77 శాతం వాటాలు ఉండగా మిగిలిన వాటాలు టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌బ్యాంక్,  ఇతర సంస్థాగత పెట్టుబడిదారులు వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థల వద్ద  ఉన్నాయి. 

ఫ్లిప్ కార్ట్ కు వచ్చిన ఆర్బీఐ లైసెన్స్ తో .. ఈ కామర్స్ రంగం రూపురేఖలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి.  నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ గా ఈ కామర్స్ సంస్థలు మారే అవకాశాలు ఉన్నాయి. ఇతర పోటీ సంస్థలు కూాడా ఈ లైసెన్‌ కోసం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని మార్గెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.