PF Withdrawal Rules: దేశంలో కోట్లాది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund PF) ఖాతా ఉంటుంది. ప్రతి నెలా జీతంలో కొంత భాగం ఈ పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. తద్వారా అవసరమైనప్పుడు మీరు ఆ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఉద్యోగం మానేసిన నెల, రెండు నెలల తరువాత చాలా మంది తమ PF ఖాతా నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకునేవారు. ఇంట్లో పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం, ఇల్లు కొనుగోలు, చదువులు లేదా ఏదైనా అత్యవసర ఖర్చుల కోసం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఇలా చేసేవారు.
కానీ ఇప్పుడు ఉద్యోగులు కొంచెం కాలమే వేచి ఉండాలి. ప్రభుత్వం, EPFO ద్వారా PF నగదు ఉపసంహరణ నిబంధనలలో మార్పులు చేశారు. ఈ మార్పు భవిష్య నిధిని అత్యవసర నిధిగా ఉపయోగించే లక్షలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. కనుక పీఎఫ్ కొత్త రూల్స్ తెలుసుకోండి.
ముందుగానే PF డబ్బును ఇలా తీసుకోవచ్చు
గతంలో నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాదారుడు ఉద్యోగం మానేస్తే, 2 నెలల తర్వాత తన PF ఖాతా నుండి మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరని వారికి ఈ రూల్ వర్తిస్తుంది. చాలా మంది ఈ డబ్బును పెళ్లి కోసం, ఇల్లు కట్టుకోవడం లేదా అప్పులు తీర్చడం, పిల్లల చదువులు వంటి వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించేవారు.
EPFO అటువంటి సందర్భాలలో కొన్ని షరతులతో ముందస్తు ఉపసంహరణకు అనుమతించింది. అంటే ఉద్యోగి ఉద్యోగం మానేసిన 60 రోజుల తర్వాత తన PF బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా చేయవచ్చు. సాధారణంగా ఒక వారంలో నగదు మీ ఖాతాలో జమ అవుతుంది.
కొత్త నిబంధనల్లో మార్పు ఏమిటి?
కొత్త PF ఖాతాల నిబంధనల ప్రకారం.. పీఎఫ్ ఖాతాదారులు ఎవరైనా ఉద్యోగం మానేసిన తర్వాత పెళ్లి, ఇల్లు కట్టుకోవడం లేదా ఏదైనా వ్యక్తిగత అవసరాల కోసం ఒక ఏడాది తర్వాత మాత్రమే PF ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోగలరు. అంటే గతంలోలాగ ఇప్పుడు మీరు కేవలం 2 నెలలు కాదు, 12 నెలలు నగదు కోసం వేచి ఉండాలి. ఈ నిర్ణయం పీఎఫ్ ఖాతాదారులను భవిష్యత్తు కోసం పొదుపు చేసే అలవాటును పెంచుతుందని, అత్యవసర భవిష్యత్ నిధిని సరైన ప్రయోజనం కోసం ఉపయోగించడంలో సహాయపడుతుందని EPFO భావిస్తోంది.
Also Read: Women Savings Schemes: మహిళల కోసం బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే! సేఫ్, అధిక వడ్డీ అందించే పథకాలు
అత్యవసర వైద్య అవసరం లేదా శాశ్వత వైకల్యం వంటి సందర్భాల్లో గతంలోలాగే తక్షణ విత్‌డ్రా సౌకర్యం కొనసాగుతుంది. ఈ మార్పు ఉద్దేశ్యం ఏమిటంటే PF ఖాతాను ఉద్యోగులకు దీర్ఘకాలిక భద్రతగా ఉంచడం. తద్వారా పీఎఫ్ ఖాతాదారులు పదవీ విరమణ సమయంలో తగినంత మొత్తాన్ని పొందడానికి వీలుంటుందని కేంద్ర కార్మిక శాఖ, ఈపీఎఫ్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.