Elon Musk Job : టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ప్రస్తుతం జాబ్ లేని వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఎలోన్ మస్క్‌తో కలిసి పనిచేసే గొప్ప అవకాశం కల్పించాడు. మస్క్ తన 'ఎవ్రీథింగ్ యాప్' కోసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కోసం వెతుకుతున్నాడు. దీని కోసం అభ్యర్థులు ఏదైనా పెద్ద పెద్ద టాప్ కంపెనీలతో కలిసి పనిచేసి ఉండవలసిన అవసరం లేదన్నారు. తను చేసే పనిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటే చాలన్నారు. ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా ఈ ఉద్యోగం గురించి సమాచారం అందించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులో అభ్యర్థులు ఎక్కడ చదువుకున్నారు అనేది ముఖ్యం కాదు.. లేదా వారు ఏ పెద్ద కంపెనీలో పనిచేశారన్నది నాకు పట్టింపు లేదని అన్నారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎంత బాగా కోడ్ చేయగలరన్నదే తనకు ముఖ్యమన్నారు.
డిగ్రీల కంటే పనే ముఖ్యం
ఒక వ్యక్తికి తన విద్యా డిగ్రీ కంటే పని చేసే సామర్థ్యం చాలా ముఖ్యమని ఎలోన్ మస్క్ కూడా ఇంతకు ముందే అన్నారు. టెస్లాలో పనిచేయడానికి ఎటువంటి డిగ్రీ అవసరం లేదని ఆయన చాలాసార్లు చెప్పారు. ఒక వ్యక్తి సామర్థ్యం అతని డిగ్రీ ద్వారా కాదు.. అతను పనిచేసే విధానం ద్వారా నిర్ణయించబడుతుందని తాను నమ్ముతాడు. పాఠశాలల్లో పిల్లలకు కంఠస్థం చేయడానికి బదులుగా సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్పించాలని ఆయన అన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్, ఇప్పుడు ఎక్స్‌లలో కూడా ఆయన అదే విధానాన్ని అవలంబిస్తున్నారు.

X ని "సూపర్ యాప్" గా మార్చే దిశగా మస్క్ మరో కీలక అడుగు వేస్తున్నారు. ఈ మేరకు మస్క్ ఎక్స్ లో చేసిన ట్వీట్ లో.. "మీరు ఒక హార్డ్‌కోర్ తెలివైన ఇంజనీర్ అయితే, ఎవ్రీథింగ్ యాప్‌ను తయారు చేయాలనుకుంటే, దయచేసి మీ ఉత్తమ పనిని Code@x.com లో మాకు షేర్ చేయండి. మీరు ఎక్కడ చదువుకున్నారో లేదా ఏ పెద్ద కంపెనీలో పనిచేశారో మాకు తెలియదు. మీ కోడ్ మాకు చూపించండి." అంటూ రాసుకొచ్చారు. అందుకు సంబంధిత అర్హతలు ఉండి మస్క్‌తో కలిసి పనిచేయాలని కలలుకంటున్నట్లయితే ఎటువంటి ఆలస్యం లేకుండా సివిని code@x.comలో త్వరగా షేర్ చేయవచ్చు.
ఈ వీడియో కూడా చూడండి
ఎవ్రీథింగ్ యాప్ అంటే ఏమిటో తెలుసా?
టెస్లా ,స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్‌లకు సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులలో ఎవ్రీథింగ్ యాప్ ఒకటి. దీని కింద ఈ అప్లికేషన్ ద్వారా మెసేజ్ పంపడం మాత్రమే కాకుండా, ఈ-కామర్స్ షాపింగ్, ఫైనాన్స్ సేవలు, పీర్-టు-పీర్ చెల్లింపులు వంటి అనేక ఇతర సౌకర్యాలను కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో పొందవచ్చు. వారు చాలా కాలంగా ఈ యాప్‌ను తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ అప్లికేషన్ అమెరికన్ పౌరులకు ఒక సూపర్ యాప్ అవుతుందని మస్క్ భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎలోన్ మస్క్ చైనా షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి సన్నాహాల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ట్విటర్ ను కొనుగోలు చేసి దానిని ఎక్స్ గా మార్చిన తర్వాత ఈ బిలియనీర్ మస్క్ ఈ ప్రసిద్ధ చైనీస్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయవచ్చని నివేదికలలో పేర్కొనబడింది. ఈ విషయంలో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.