Tata Group Dividend Stocks: మన దేశంలోనే కాదు, ప్రపంచ ప్రసిద్ధ బిజినెస్‌ గ్రూప్‌ల్లో టాటా గ్రూప్ ఒకటి. ఇప్పుడు, Q4 FY24 ఫలితాలు సీజన్‌ నడుస్తోంది. టాటా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల్లో రెండు కంపెనీలు ఇప్పటికే ఫలితాలు ప్రకటించాయి, మరికొన్ని ప్రకటించాల్సి ఉంది. రిజల్ట్స్‌ రోజున, తన పెట్టుబడిదార్లకు మంచి డివిడెండ్‌ ప్రకటించాలని కూడా ఈ కంపెనీలు యోచిస్తున్నట్లు సమాచారం. టాటా గ్రూప్‌లోని మొత్తం 11 కంపెనీల ఇన్వెస్టర్లకు డివిడెండ్ రూపంలో రివార్డ్‌ దొరకబోతోంది. వీటిలో 8 స్టాక్స్‌ మాత్రమే "బయ్‌" రేటింగ్‌తో ఉన్నాయి. మిగిలిన మూడింటికి ఎనలిస్ట్‌ కవరేజ్‌ లేదు.


"బయ్‌" రేటింగ్‌ ఉన్న టాటా గ్రూప్‌ కంపెనీలు... టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, ట్రెంట్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా పవర్, టాటా కమ్యూనికేషన్స్, ఇండియన్ హోటల్స్, టాటా ఎల్‌క్సీ.


1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 3,827.45 ---------- టార్గెట్ ప్రైస్‌: రూ. 4700
ఎక్కువ బ్రోకరేజీలు TCS షేర్ల పట్ల బుల్లిష్‌గా ఉన్నాయి. ఒక్కో షేరుపై రూ.28 తుది డివిడెండ్‌ను టీసీఎస్ ప్రకటించింది.


2. టాటా కమ్యూనికేషన్స్ ‍‌(Tata Communications)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 1,754.95 ---------- టార్గెట్ ప్రైస్‌: రూ. 2,125
FY24లో ఒక్కో షేరుకు రూ.16.70 తుది డివిడెండ్‌ను ఈ కంపెనీ ప్రకటించింది.


3. టాటా ఎల్‌క్సీ (Tata Elxsi‌)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 7,444.50 ---------- టార్గెట్ ప్రైస్‌: రూ. 9,000
FY24 కోసం, ఈ నెల 23న డివిడెండ్ సిఫార్సును పరిశీలించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.


4. టాటా పవర్ (Tata Power)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 428 ---------- టార్గెట్ ప్రైస్‌: రూ. 439
FY24 కోసం డివిడెండ్ & Q4 ఆదాయాలను ప్రకటించడానికి కంపెనీ బోర్డ్‌ వచ్చే నెల 08న సమావేశం అవుతుంది.


5. టాటా మోటార్స్ (టాటా మోటార్స్)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 963.20 ---------- టార్గెట్ ప్రైస్‌: రూ. 1,075
తన Q4 ఆదాయాలను మే 10న ప్రకటిస్తుంది. డివిడెండ్‌ ఇవ్వాలని భావిస్తే అదే రోజున ప్రకటిస్తుంది.


6. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (Tata Consumer Products)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 1,137.50 ---------- టార్గెట్ ప్రైస్‌: రూ. 1,370
మార్చి త్రైమాసికం ఫలితాలను పరిగణనలోకి తీసుకుని, FY24కి తుది డివిడెండ్‌ సిఫార్సు చేయడానికి ఈ నెల 23న సమావేశం అవుతుంది.


7. ట్రెంట్ (Trent)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 4,152.55 ---------- టార్గెట్ ప్రైస్‌: రూ. 4,200
నాలుగో త్రైమాసికం ఫలితాలను ఈ నెల 29న ప్రకటిస్తుంది. డివిడెండ్‌ ఇవ్వాలని భావిస్తే అదే రోజున అనౌన్స్‌ చేస్తుంది.


8. ఇండియన్ హోటల్స్ (Indian Hotels)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 596.65 ---------- టార్గెట్ ప్రైస్‌: రూ. 625
Q4 రిజల్ట్స్‌, కొత్త డివిడెండ్‌ను ఈ నెల 24న ప్రకటించబోతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఎవరెస్ట్ మసాలాలో ప్రమాదకర రసాయనం!, వాడొద్దంటూ ప్రజలకు హెచ్చరిక