Reliance AGM LIVE Updates: రాబోయే ఐదేళ్లు రిలయన్స్‌ ఛైర్మన్‌, ఎండీగా నేనే!

Reliance AGM LIVE Updates: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ ఏజీఎం మొదలైంది. ఆ కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ ఇన్వెస్టర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.

Rama Krishna Paladi Last Updated: 28 Aug 2023 04:21 PM
Reliance AGM LIVE Updates: రాబోయే ఐదేళ్లు రిలయన్స్‌ ఛైర్మన్‌, ఎండీగా నేనే!

Reliance AGM 2023: దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. రాబోయే ఐదేళ్లలో కంపెనీకి తానే ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉంటానని ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. ఆకాశ్, అనంత్‌, ఇషాకు మెంటార్‌గా ఉంటానన్నారు. అందరికీ డిజిటల్‌ టూల్స్‌ అందించడం, అంతాటా గ్రీన్‌ ఎనర్జీ, అంతటా ఆర్థిక స్వావలంబన, వ్యాపార దక్షత, ఉపాధి కల్పన, అంతటా ఆరోగ్యకరమైన వినియోగం, అంతటా నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

Reliance AGM LIVE Updates: ఇన్వెస్టర్లకు బంపర్‌ ఆఫర్‌! రాబోయే 10 ఏళ్లలో డబ్బులే డబ్బులు!

Reliance AGM 2023: భవిష్యత్తులో చక్కని డిమాండ్‌ ఉండే వ్యాపారాలనే ఎంచుకుంటున్నామని ముకేశ్‌ అంబానీ అన్నారు. మానవ వనరులే తమకున్న అతిపెద్ద బలమని పేర్కొన్నారు. సృజనాత్మక మేథస్సు, లక్ష్య కోసం పనిచేసే బృందాలే గొప్ప విలువను చేకూరుస్తాయని తెలిపారు. ఇన్వెస్టర్లకు చివరి 45 ఏళ్లలో సృష్టించిన సంపద కన్నా రాబోయే దశాబ్దంలో మరిన్ని రెట్లు అందిస్తామన్నారు.

Reliance AGM LIVE Updates: ఒలింపిక్‌ ఉద్యమానికి రిలయన్స్‌ అండ

Reliance AGM 2023: రిలయన్స్‌ ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ ప్రోగ్రామ్‌ 2.2 కోట్ల మందికి చేరుకుందని నీతా అంబానీ తెలిపారు. నీతా ముకేశ్ అంబానీ కల్చరల్‌ సెంటర్లో అక్టోబర్లో ఐవోసీ 141 సెషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 40 ఏళ్ల తర్వాత ఒలింపిక్‌ మూమెంట్‌ను తీసుకొచ్చేందుకు మొదటి అడుగు వేస్తామన్నారు. 

Reliance AGM LIVE Updates: ఇషా నేతృత్వంలో కొత్త పాఠశాల

Reliance AGM 2023: రిలయన్స్‌ రిటైల్‌ను నడిపిస్తున్న ఇషా అంబానీ సారథ్యంలో రిలయన్స్‌ ఒక కొత్త పాఠశాలను ఆరంభిస్తోంది. దీనికి నీతా ముకేశ్ అంబానీ జూనియర్‌ స్కూల్‌ అని పేరు పెడతారని సమాచారం.

Reliance AGM LIVE Updates: 100 బయో గ్యాస్‌ ప్లాంట్ల నిర్మాణం

Reliance AGM 2023: 'రాబోయే ఐదేళ్లలో 100 కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్లు నిర్మించాలన్నది మా లక్ష్యం. 55 లక్షల టన్నుల వ్యవసాయ వృథా ఇందుకు అవసరం. దాంతో 20 లక్షల టన్నుల కార్పన్‌ ఉద్గారాలు తగ్గుతాయి. దీంతో 0.7 మిలియన్‌ టన్నుల ఎల్‌పీజీ దిగుమతి తగ్గుతుంది' అని ముకేశ్ అంబానీ అన్నారు.

Reliance AGM LIVE Updates: 2026లో రిలయన్స్‌ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ

Reliance AGM 2023: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2026లో బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఆరంభించనుంది. ఇందులో బ్యాటరీ రీసైకిలింగ్‌ ఫెసిలిటీ కూడా ఉంటుంది.

Reliance AGM LIVE Updates: బీమా రంగంలోకి జియో ఫైనాన్స్‌

Reliance AGM 2023: ప్రతి రిలయన్స్ షేరు హోల్డర్‌కు జియో ఫైనాన్షియల్‌ షేర్లు 1:1 నిష్పత్తిలో కేటాయించాం. దేశంలోని 1.42 బిలియన్ల మందికి ఆర్థిక సేవలు అందించేందుకు సిద్ధమయ్యాం. సీబీడీసీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో పెట్టుబడులు పెడతాం. జీవిత బీమా, ఆరోగ్య బీమా ఉత్పత్తలు ఆఫర్‌ చేస్తాం. డిజిటల్‌ ఫస్ట్‌ ఆర్కిటెక్చర్‌ వల్ల కోట్లాది మందికి సేవలు లభిస్తాయి.

Reliance AGM LIVE Updates: ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది విజిట్‌ చేసిన టాప్‌-10 రిటైలర్స్‌లో రిలయన్స్ రిటైల్‌

Reliance AGM 2023: రిలయన్స్‌ రిటైల్‌ విలువ రెట్టింపు అయింది. 2020 సెప్టెంబర్లో రూ.4.28 లక్షల కోట్లుగా ఉన్న విలువ ప్రస్తుతం రూ.8.28 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఇన్వెస్టర్లు రిలయన్స్‌ రిటైల్‌ వైపు చూస్తున్నారు. డిజిటల్‌, న్యూ కామర్స్‌ సేల్స్‌ రూ.50,000 కోట్లుగా ఉన్నాయి. నమోదిత కస్టమర్లు 25 కోట్లకు చేరుకున్నారు. 2023 ఆర్థిక ఏడాదిలో 78 కోట్ల మంది స్టోర్లను సందర్శించారని ఇషా అంబానీ అన్నారు.

Reliance AGM LIVE Updates: భారత్‌ కేంద్రంగా ఏఐ మోడళ్లు

Reliance AGM 2023: భారత్‌ కేంద్రంగా కృత్రిమ మేథా పరిష్కారాలు అందిస్తామని ముకేశ్ అంబానీ అన్నారు. అందరికీ ఏఐ సేవలు అందిస్తామని ప్రామీస్‌ చేశారు.

Reliance AGM LIVE Updates: అంతర్జాతీయంగా ఎక్కువ మంది చూసిన ఈవెంట్‌గా ఐపీఎల్‌

Reliance AGM 2023: ఈ ఏడాది జియో సినిమాలో ఐపీఎల్‌ ప్రసారం అయింది. 45 కోట్ల మందికి పైగా ఐపీఎల్‌ను వీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది చూసిన ఈవెంట్‌గా నిలిచింది.

Reliance AGM LIVE Updates: 2జీ ధరకే 4జీ ఫోన్లు

Reliance AGM 2023: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జియో భారత్‌ ఫోన్లను ఆవిష్కరించింది. స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేయలేని వారికి జియో భారత్‌ గేట్‌వేగా మారుతాయని ఆకాశ్ అన్నారు. కేవలం 2జీ ఫోన్ల ధరకే 4జీ ఫోన్లు ఇస్తున్నామని తెలిపారు.

Reliance AGM LIVE Updates: 200 మిలియన్లకు పైగా ఇళ్లకు జియో ఫైబర్‌

Reliance AGM LIVE Updates: జియో ఫైబర్‌ ఇప్పటికే 10 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందించింది. ప్రతి నెలా వేల మంది కొత్త కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు జియో ఎయిర్‌ ఫైబర్‌తో 200 మిలియన్లకు పైగా ఇళ్లకు ఇంటర్నెట్‌ చేరుతుందని రిలయన్స్‌ ఛైర్మన్‌ ఆకాశ్ అంబానీ అన్నారు.

Reliance AGM LIVE Updates: వినాయక చవితికి జియో ఎయిర్‌ ఫైబర్‌

Reliance AGM LIVE Updates: జియో ఇన్ఫోకామ్‌ వినాయక చవితికి ఓవర్‌ ది ఎయిర్ 5జీ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు మొదలు పెట్టనుంది. ఆకాశ్ అంబానీ జియో స్మార్ట్‌ హోమ్‌ సర్వీసెస్‌ను ఆరంభించారు.

Reliance AGM LIVE Updates: డిసెంబర్లో జియో 5G కవరేజీ పూర్తి

Reliance AGM LIVE Updates: రిలయన్స్‌ జియో రూ.1.19 లక్షల కోట్ల రెవెన్యూ పోస్ట్‌ చేసింది. 450 మిలియన్లు మంది యూజర్లు ఉన్నారు.  ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా దేశవ్యాప్తంగా 5జీ కవరేజీ పూర్తి చేస్తామని అంబానీ అన్నారు.

Reliance AGM LIVE Updates: రిలయన్స్‌ బోర్డు నుంచి తప్పుకున్న నీతా అంబానీ

Reliance AGM LIVE Updates: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు నుంచి నీతా అంబానీ తప్పుకున్నారు. ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్‌ అంబానీ నాన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియామకం అయ్యారు.

Reliance AGM LIVE Updates: పదేళ్లలో 150 బిఇలయన్‌ డాలర్లు

Reliance AGM LIVE Updates: చివరి పదేళ్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 150 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడి పెట్టింది. కంపెనీలు ఎగుమతులు 33 శాతం పెరిగాయి. రూ.1.77 లక్షల కోట్ల ఆదాయపన్ను చెల్లించింది.

Reliance AGM LIVE Updates: చంద్రయాన్‌కు ప్రశంసలు

Reliance AGM LIVE Updates: ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతం అవ్వడంపై ముకేశ్‌ అంబానీ మాట్లాడారు. శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు. 

Reliance AGM LIVE Updates: మొదలైన రిలయన్స్‌ ఏజీఎం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సాధారణ వార్షిక సమావేశం మొదలైంది. ఇన్వెస్టర్లను ఉద్దేశించి కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతున్నారు. పలు కీలక అంశాలను ఆయన వివరిస్తున్నారు.

Background

Reliance AGM LIVE Updates: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ ఏజీఎం మొదలైంది. ఆ కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ ఇన్వెస్టర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.