OpenAI Employees: మీలాంటి అసమర్థుల దగ్గర మేం పని చేయం, ఉద్యోగాలు వదిలేస్తాం - ఓపెన్‌ఏఐకి భారీ షాక్‌

Sam Altman Effect: సామ్ ఆల్ట్‌మన్‌ను బోర్డు తిరిగి నియమించాలని, ఆల్ట్‌మన్‌కు వ్యతికంగా పని చేసిన బోర్డ్‌ డైరెక్టర్లు తమ పదవికి నుంచి దిగిపోవాలని ఓపెన్‌ఏఐ ఉద్యోగులు ఆల్టిమేటం జారీ చేశారు.

Continues below advertisement

OpenAI Employees - Sam Altman: గ్లోబల్‌ టెక్‌ సెక్టార్‌లో సామ్‌ ఆల్ట్‌మన్‌ తొలగింపు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సామ్‌ ఆల్ట్‌మన్‌ను ‍‌(OpenAI’s Sam Altman) బలవంతంగా ఓపెన్‌ఏఐ సీఈవో సీట్‌ నుంచి దించేయడంపై నిరసనలు పెరుగుతున్నాయి. తాజాగా.. అదే కంపెనీలోని ఉద్యోగుల్లో దాదాపు 80% మంది మాజీ సీఈవోకి బాసటగా నిలిచారు. తాము కూడా ఉద్యోగాలు వదిలేయాడనికి సిద్ధంగా ఉన్నామని ‍‌(OpenAI Employees Threaten Mass Walkout) వార్నింగ్‌ లెటర్‌ విడుదల చేశారు.

Continues below advertisement

అవమానకర రీతిలో తొలగించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (OpenAI CEO) సామ్ ఆల్ట్‌మన్‌ను బోర్డు తిరిగి నియమించాలని, ఆల్ట్‌మన్‌కు వ్యతికంగా పని చేసిన బోర్డ్‌ డైరెక్టర్లు తమ పదవికి నుంచి దిగిపోవాలని ఓపెన్‌ఏఐ ఉద్యోగులు ఆల్టిమేటం జారీ చేశారు. ఈ రెండు జరగకపోతే తాము మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని కంపెనీని బెదిరించారు. 

ఘాటైన భాషతో ఓపెన్‌ లెటర్‌ (OpenAI employees open letter)
ప్రస్తుతం, ఓపెన్‌ఏఐలో 700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కంపెనీకి రాసిన ఓపెన్ లెటర్‌లో, దాదాపు 550 మంది బోర్డు మెంబర్ల రాజీనామాకు డిమాండ్‌ చేశారు. ఆల్ట్‌మన్‌ను తిరిగి నియమించి, వాళ్లు మాత్రం బయటకు వెళ్లాల్సిందేనని కుండ బద్ధలు కొట్టారు. 

"ఓపెన్‌ఏఐని పాలించడంలో మీరు (మిగిలిన బోర్డ్‌ డైరెక్టర్లు) అసమర్థులన్న విషయం సామ్‌ తొలగింపుతో స్పష్టమైంది. కంపెనీ మిషన్, ఉద్యోగులపై శ్రద్ధ, నిబద్ధత లేని వ్యక్తుల కోసం మేం పని చేయలేం" అని ఓపెన్‌ లెటర్‌లో ఉద్యోగులు ఘాటుగా వ్యాఖ్యానించారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రాడ్ లైట్‌క్యాప్ కూడా ఈ లెటర్‌ మీద సంతకం చేశారు.

చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త, ఓపెన్‌ఏఐ కో-ఫౌండర్‌, CEO అయిన సామ్ ఆల్ట్‌మన్‌ను, డైరెక్టర్ల బోర్డ్‌ గత వారం తొలగించింది. సామ్ నాయకత్వంపై నమ్మకం లేదని, బోర్డ్‌ తీసుకునే నిర్ణయాలకు అతను అడ్డు పడుతున్నాడన్న ఆరోపణలతో సామ్‌ను CEO పదవి నుంచి దించేసింది. చాట్‌జీపీటీ వంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన వ్యక్తిని అంత అవమానకరంగా బయటకు పంపేసిన ఘటన టెక్‌ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. ఓపెన్‌ ఏఐలో పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు, గ్లోబల్‌ టెక్‌ వర్గాలు ఈ కంపెనీలో జరిగే వ్యవహారాలపై ఓ కన్నేశాయి.

సామ్‌కు మద్దతుగా, సామ్‌ ఆల్టమన్‌ను తప్పించిన గంటల వ్యవధిలోనే, ఓపెన్‌ఏఐ కో-ఫౌండర్‌, ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ (Greg Brockman) కూడా తన పదవికి రాజీనామా చేశారు.

మైక్రోసాఫ్ట్‌లోకి  సామ్‌ ఆల్ట్‌మన్‌
ఓపెన్‌ లెటర్‌ రాయడానికి ఒక రోజు ముందు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సామ్‌ ఆల్ట్‌మన్‌ మైక్రోసాఫ్ట్‌లో చేరతారని, తమ కొత్త AI (Artificial Intelligence) రీసెర్చ్‌ టీమ్‌కు నాయకత్వం వహిస్తారని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల (Microsoft CEO Satya Nadella) ప్రకటించారు. గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ కూడా తమతో చేరతారని కన్ఫర్మ్‌ చేశారు.

సామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్‌ఏఐలోకి తిరిగి తీసుకోకపోతే తాము కూడా మైక్రోసాఫ్ట్‌ కొత్త AI ప్రాజెక్టులోకి వెళ్లిపోతామని, తమను తీసుకోవడానికి ఆ మైక్రోసాఫ్ట్‌ సిద్ధంగా ఉందని ఓపెన్‌ లెటర్‌లో ఓపెన్‌ఏఐ ఉద్యోగులు స్పష్టం చేశారు.

మరో ఆసక్తికర కథనం: ఒక్కసారిగా పెరిగిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Continues below advertisement
Sponsored Links by Taboola