Budget 2026: పార్లమెంటరీ కార్యకలాపాల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు ఎల్లప్పుడూ ఆకట్టుకుంటుంది, కానీ బడ్జెట్ రోజున, ఆయన హావభావాలు, ఆయన భావోద్వేగాలు, ప్రశంసించే తీరు వేరే స్థాయికి చేరుకుంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు లోపల తన బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతుండగా, ప్రధానమంత్రి మోడీ దృష్టి ఫోకస్డ్‌ మైండ్‌తో బడ్జెట్‌ను వింటూ  ప్రతి అంకెను, ప్రతి ప్రణాళికను ఎంత లోతుగా అర్థం చేసుకుంటూ ప్రశంసించారు.  

Continues below advertisement

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ప్రధానమంత్రి మోడీ బడ్జెట్‌ను కేవలం వార్షిక లాంఛనప్రాయ బడ్జెట్ నుంచి "జాతి నిర్మాణానికి ఒక ప్రణాళిక"గా మార్చారు. ఆయన ముఖ కవళికలు, ఆయన చూపు, అప్పుడప్పుడు చిరునవ్వుతో ఆమోదం తెలుపుతూ "అభివృద్ధి చెందిన భారతదేశం" పట్ల ఆయన ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రదర్శిస్తుంటారు. 

టేబుల్ తట్టడం: ప్రశంస, విశ్వాసానికి సంకేతం.

ఆర్థిక మంత్రి పార్లమెంటులో ఒక ప్రధాన ప్రభుత్వ పథకాన్ని లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడల్లా, సభలో ఒక విలక్షణమైన ధ్వని ప్రతిధ్వనిస్తుంది: బల్లలు చప్పుడు. ఈ ధ్వని తరచుగా ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలోనే జరుగుతుంది.

నిర్మలా సీతారామన్ మౌలిక సదుపాయాలు, వ్యవసాయ సంస్కరణలు లేదా మధ్యతరగతి వారికి ఉపశమనం ప్రకటించినప్పుడు, ప్రధానమంత్రి మోడీ ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తరచుగా టేబుల్‌పై చప్పుడు చేయడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, తన బృందం పని పట్ల గర్వాన్ని వ్యక్తపరిచే ఒక మార్గం. బడ్జెట్‌లో చేర్చిన విధానాలు ఆయన దార్శనికతకు నేరుగా అనుగుణంగా ఉన్నాయని ఈ స్పందన నిరూపిస్తుంది. ఈ చప్పుడు ఎంపీలకు శక్తినిస్తుంది. నాయకత్వం ఈ నిర్ణయాల వెనుక దృఢంగా ఉందని దేశానికి సందేశాన్ని పంపుతుంది.

ప్రధానమంత్రి మోడీ బాడీ లాంగ్వేజ్‌, ఆయన ప్రతిస్పందనలు బడ్జెట్‌ను కేవలం అంకెల ఆటగా కాకుండా, దేశ దిశానిర్దేశం చేసే ఒక మార్గంగా ఆయన చూస్తున్నారని రుజువు చేస్తున్నాయి. ఆయన చిరునవ్వు, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రసంగం ఈ బడ్జెట్ దేశాన్ని స్వావలంబనగా మార్చే దిశగా మరో ప్రధాన అడుగు అని స్పష్టం చేస్తున్నాయి.