కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ దేశ ప్రజలందరి కోసం కాదని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ పై తమకు ఎలాంటి అంచనాలు లేవని అన్నారు. కేంద్రం ఏ వర్గానికి న్యాయం చేయడం లేదని విమర్శించారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం కేంద్ర బడ్జెట్ పై వ్యంగ్యంగా స్పందించారు. "ఏ ప్రభుత్వంపై అయితే ఎటువంటి ఆశలు లేవో, ఆ ప్రభుత్వం బడ్జెట్‌పై ఎవరికి అంచనాలు ఉంటాయి. ఈ బడ్జెట్ దేశ ప్రజల్లో 5 శాతం మంది కోసం మాత్రమే ప్రవేశపెడుతున్నారు". దేశంలో, రాజధాని ఢిల్లీలో కాలుష్యం సమస్యను లేవనెత్తారు. "ప్రపంచంలోనే అతిపెద్ద వేదికపై మీ దేశంలో గాలి నాణ్యత సరిగ్గా లేదని, దీనివల్ల ప్రాణాలు పోతున్నాయని, పెట్టుబడులు కూడా రావని ప్రశ్న తలెత్తింది" అన్నారు.