Budget 2025 Expectations: బండి కదలాలంటే బడ్జెట్‌ బూస్ట్‌ కావాలి - ఆటోమొబైల్‌ సెక్టార్‌ కోర్కెల లిస్ట్‌ ఇదీ

Union Budget 2025: వచ్చే నెల మొదటి తేదీన సమర్పించే బడ్జెట్‌పై ఆటోమొబైల్ రంగం పెద్ద అంచనాలు పెట్టుకుంది. GST తగ్గింపు నుంచి వాహనాల స్క్రాపింగ్‌ వరకు చాలా ఆశలు ఉన్నాయి.

Continues below advertisement

Hopes Of The Automobile Sector On Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman) 01 ఫిబ్రవరి 2025న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు. నిర్మలమ్మ ప్రకటించే వరాల కోసం దేశంలోని అన్ని రంగాలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. వాహన రంగం కూడా ఆశాహహుల లిస్ట్‌లో ఉంది. ఈ బడ్జెట్ నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీ (Automobile Industry) చాలా పెద్ద సంస్కరణలు కోరుకుంటోంది. వాటిలో... హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వాహనాలపై GST రేటు తగ్గింపు నుంచి వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించడం వరకు అనేక అంశాలు ఉన్నాయి. 

Continues below advertisement

కేంద్ర ప్రభుత్వం, 2025 బడ్జెట్‌లో ఆటోమొబైల్ రంగానికి ఏయే ప్రోత్సాహక పథకాలను ప్రకటించవచ్చన్న అంచనాలు ఇవి:

PLI స్కీమ్‌ పొడిగింపు
వచ్చే నెల ఒకటో తేదీన సమర్పించే బడ్జెట్‌లో, ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఇందులో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles - EVs) విడిభాగాలు & బ్యాటరీ తయారీ కోసం ఈ పథకం విస్తరణ ఉండొచ్చు. ప్రస్తుతం, పరిమితంగా ఉన్న EV బ్యాటరీల సామర్థ్యం ప్రధాన అడ్డంకిగా ఉంది. PLI స్కీమ్‌ ద్వారా బ్యాటరీల సామర్థ్యాన్ని మెరుగుపరచగలిగితే EVల స్వీకరణ పెరుగుతుంది. భారతదేశాన్ని ప్రపంచ EV ఉత్పత్తి కేంద్రంగా మార్చడంలో & గ్రీన్ మొబిలిటీ పరిష్కారాలను వేగవంతం చేయడంలో ఇది సహాయపడుతుంది.

GST రేటు తగ్గింపు
హైబ్రిడ్ వాహనాలు ‍‌(Hybrid vehicles), ఎలక్ట్రిక్ వాహనాలపై 'గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్' (GST) రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ ఇండస్ట్రీ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. టాక్స్‌ తగ్గితే దానికి అనుగుణంగా EVల ధరలు తగ్గుతాయి, ప్రజల నుంచి కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ చర్య పర్యావరణ అనుకూల వాహనాల స్వీకరణను ప్రోత్సహిస్తుంది, కేంద్ర ప్రభుత్వ హరిత & స్థిరమైన భవిష్యత్‌ చొరవలకు తోడ్పాడు అందిస్తుంది.

వాహనాల స్క్రాపింగ్ ప్రోత్సాహకం
పాత వాహనాల స్క్రాపింగ్‌ను (పాత వాహనాలను తక్కువగా మార్చడం) ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, స్పష్టమైన విధానాలను ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించవచ్చు. స్క్రాపింగ్ విషయంలో ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు లభిస్తే.. ప్రజలు తమ పాత వాహనాలను తుక్కు కింద తీసేస్తారు, కొత్త వాహనాలు కొనుక్కుంటారు. దీనివల్ల వాహనాల అమ్మకాలు పెరగడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. 

హైడ్రోజన్ ఇంధనంపై పరిశోధనకు ప్రోత్సాహకం
హైడ్రోజన్ ఇంధనం & అధునాతన ప్రయాణ సౌకర్యాలపై పరిశోధన కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా ఆటోమెబైల్‌ ఇండస్ట్రీ ఆశిస్తోంది. ఎలక్ర్టిక్‌ వెహికల్స్‌ మీద ప్రజలకు ఆసక్తి ఉన్నప్పటికీ, ఛార్జింగ్‌ స్టేషన్ల ప్రధాన సమస్యగా మారాయి. EVల ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లేకపోవడం వల్ల ప్రజలు ఇప్పటికీ సంప్రదాయ ఇంధన (పెట్రోల్‌ & డీజిల్‌) వాహనాలను కొంటున్నారు. దేశవ్యాప్తంగా బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను (Charging infrastructure) అభివృద్ధి చేయగలిగితే, EVలకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. కాబట్టి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచే విధానాలను ఈ బడ్జెట్‌లో తీసుకురావచ్చు.

మరో ఆసక్తికర కథనం: ఆర్థిక మంత్రులే కాదు, ప్రధాన మంత్రులూ కేంద్ర బడ్జెట్‌ సమర్పించారు - ఎవరు వాళ్లు? 

Continues below advertisement