Rahul Gandhi on Budget: బడ్జెట్‌లో ఏం లేదా? అర్థం చేసుకునే బుర్ర మీకు లేదు: నిర్మలా సీతారామన్

ABP Desam Updated at: 01 Feb 2022 07:55 PM (IST)
Edited By: Murali Krishna

బడ్జెట్‌ను అర్థం చేసుకుని తర్వాత రాహుల్ గాంధీ విమర్శించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి

NEXT PREV

బడ్జెట్​పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు చూసి తాను జాలి పడుతున్నానన్నారు సీతారామన్. పేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల కోసం బడ్జెట్​లో ఏమీ లేదన్న రాహుల్ విమర్శలను ఆమె తోసిపుచ్చారు.









రాహుల్.. ముందు బడ్జెట్‌ను అర్థం చేసుకోవాలి. ట్విట్టర్​లో ఏదొకటి పోస్ట్ చేయాలన్న హడావుడిలో బడ్జెట్‌లో ఏం లేదు ఇలా అనడం తగదు. ఆయన సరైన హోంవర్క్ చేయాలి. బడ్జెట్​ను పూర్తిగా అర్థం చేసుకుని విమర్శిస్తే సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం.  ముందు ఆయన పంజాబ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సంగతి చూసుకోవాలి. ఆ తర్వాత దేశం గురించి మాట్లాడితే బాగుంటుంది.                                              -  నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

 

రాహుల్ ఏమన్నారంటే..?

 

బడ్జెట్‌పై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రజల వద్ద నుంచి పన్నులను పిండుకోవడం తప్ప.. ఏ ఒక్క రంగానికి చేయూత ఇచ్చే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇది జీరో బడ్జెట్ అని విమర్శించారు.

 


ఇది సున్నా బడ్జెట్. ఉద్యోగులకు, మధ్య తరగతి ప్రజలకు, పేదవాళ్లకు, యువత, రైతులు, ఎంఎస్‌ఎంఈకి ఈ బడ్డెట్‌లో ఎంటువంటి కేటాయింపులు లేవు.                              -  రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత


Published at: 01 Feb 2022 07:55 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.