Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. దీనిపై యావత్‌ దేశం దృష్టి కేంద్రీకృతమైంది. దేశంలోని ప్రతి రంగం నిర్మలమ్మ వైపు ఆశగా ఎదురు చూస్తోంది. భారీ అంచనాలు అంచనాలు పెట్టుకొని ఉన్నాయి. అలాంటి పరిస్థితే రక్షణ రంగానికి కూడా ఉంది. ఈసారి కూడా రక్షణ రంగానికి ఈ బడ్జెట్‌లో భారీగానే కేటాయింపులు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

పెరుగుతున్న సవాళ్ల మధ్య సైన్యం బలోపేతం అవసరంప్రపంచంలో చాలా ప్రాంతాల్లో అస్థిరత ఏర్పడి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదాలు ఉండనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాస్త శాంతి చర్చలతో పరిస్థితి అందులో ఉన్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం అనుకోలేం. మరోవైపు భారత్ సరిహద్దుల్లో పరిస్థితి కూడా అంత బాగా లేదు. సమయం కోసం చైనా, పాకిస్థాన్ వెయిట్ చేస్తున్నాయి. 

Also Read: బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. మరి మంత్రిగారు కరుణించేనా ?

ఇలాంటి వాతావరణంలో ఒక్క భారత్‌లోనే కాకుండా దేశాలు మత రక్షణ రంగ వ్యయాన్ని భారీగా పెంచుకుంటూ పోతున్నాయి. ప్రజల రక్షణ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. గతం కంటే కాస్త ఎక్కువ నిదులు కేటాయిస్తున్నాయి. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. ఇప్పుడు భారత్‌కి కూడా ఇది తప్పనిసరి కానుంది. చుట్టుపక్కల శత్రువులను పెట్టుకొని గమ్మునుండటం శ్రేయస్కరం కాదని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా సైనిక రంగంలో అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. అయినా రక్షణ రంగంపై భారతదేశం చేస్తున్న వ్యయం GDPలో 2.5 శాతం కంటే తక్కువగానే ఉంది. 2022 సంవత్సరంలో భారతదేశం తన మొత్తం జిడిపిలో 2.4 శాతం రక్షణ రంగానికి ఖర్చు చేసింది. ఈ విషయంలో చైనా తర్వాతే భారత్ ఉంది. రాబోయే కాలంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవాలంటే సైన్యం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని, అందుకే రక్షణ రంగంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. 

Also Read: ఫిబ్రవరి 01లోపు ఈ పదాలు తెలుసుకోండి, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం సులభంగా అర్ధమవుతుంది

సరిహద్దు భద్రత కోసం మరిన్ని కేటాయింపులు అవసరంకేంద్రం ఏటా రక్షణ శాఖకు కేటాయించే బడ్జెట్‌లో ఎక్కువ శాతం జీతాలకు, ఇతర పింఛన్లకు వెళ్లిపోతుంది. రక్షణ రంగం అప్‌డేట్ అయ్యేందుకు చేసే కేటాయింపులు తక్కువగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. అయిుతే దీన్ని ప్రాధాన్య అంశంగా తీసుకొని కేటాయింపులు చేయాలని సూచిస్తున్నారు. ఒకవైపు చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలతో వివాదాలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో టెన్షన్ ఉండనే ఉంటోంది. తరచుగా చొరబాట్లు, ఘర్షణ వాతావరణం కనిపిస్తూనే ఉంది. అందువల్ల సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతోపాటు నిఘా వ్యవస్థలపై మరింత పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంది.

అంతర్గత సవాళ్లు తక్కువేమీ కాదు.దేశంలో తీవ్రవాదం, నక్సలిజం ఉగ్రవాద ఘటనల ముప్పు లేకపోలేదు. కాబట్టి సైనికుల శిక్షణ నుంచి ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు, పారామిలిటరీ బలగాలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను బలోపేతం చేయాలి. ఆయా సెక్టార్లకు ఆధునిక పరికరాలు, వనరులతో అన్నింటినీ సమకూర్చడమం చాలా అవసరం. రక్షణ రంగంలో కూడా దేశాన్ని స్వావలంబనగా మార్చాల్సిన అవసరం ఉంది. దేశంలోనే రక్షణ పరికరాల తయారీకి సంబంధించిన పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కేటాయింపులు చేయాలి.