Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం ఈ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. పెరిగిపోతున్న భవన నిర్మాణ ఖర్చులు, అధిక వడ్డీరేట్లు, స్టాంప్ డ్యూటీ వంటి సమస్యల నుంచి బయటపడేందుకు ఈ రంగానికి కొన్ని కీలక సాయాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచే ఈ డిమాండ్‌లు ఉన్నప్పటికి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. ఈసారి బడ్జెట్ కచ్చితంగా దీన్ని అడ్రెస్ చేస్తారనే ఆశతో ఆ రంగం ఎదురు చూస్తోంది.
రియల్ ఎస్టేట్ రంగం ఆశలు
రియల్ ఎస్టేట్ రంగానికి ‘ప్రముఖ పరిశ్రమ’ (Industry Status) హోదా ఇవ్వాలని, అలాగే హోం లోన్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గృహ కొనుగోలుదారులపై పెరుగుతున్న భారం దృష్ట్యా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను మరింత మంది ప్రజలకు అందించేందుకు ‘తక్కువ ధరకు ఇళ్లు’ (Affordable Housing) పరిమితిని పెంచాలని కూడా సూచిస్తున్నారు.
Also Read : Budget 2025 : బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. మరి మంత్రిగారు కరుణించేనా ?
బలంగా ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్
సీబీఆర్ఈ సంస్థ భారతదేశం, దక్షిణాసియా, పశ్చిమాసియా & ఆఫ్రికా ప్రాంతాల ఛైర్మన్ అను షుమన్ మ్యాగజిన్ మాట్లాడుతూ.. "రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత బలంగా ఎదుగుతోంది. ప్రధానంగా బెంగళూరు, నోయిడా, పుణే, చెన్నై వంటి నగరాల్లో లగ్జరీ & ప్రీమియం సెగ్మెంట్‌కి భారీ డిమాండ్ ఉంది" అని తెలిపారు.
2024లోనూ లగ్జరీ, ప్రీమియం ప్రాపర్టీల డిమాండ్ అత్యధికంగా ఉండగా, ప్రధాన నగరాల్లో రూ. 10 కోట్లు నుండి రూ. 80 కోట్ల మధ్య ఖరీదైన ఇళ్ల కొనుగోలు బాగా పెరిగినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అమ్ముడైన గృహాల్లో 80శాతం పైనవి రూ. కోటి (10 మిలియన్) కన్నా ఎక్కువ విలువైనవే కావడం గమనార్హం.
రియల్ ఎస్టేట్ రంగానికి అవసరమైన మార్పులు
* హోం లోన్ పన్ను మినహాయింపు: ప్రస్తుత రూ. 2 లక్షల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలి.
* స్టాంప్ డ్యూటీ తగ్గింపు: గృహ కొనుగోలుదారులపై భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.
* తక్కువ ధర గృహాల పరిమితి పెంపు: దేశీయ రియల్ ఎస్టేట్ వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేందుకు తక్కువ ధర గృహాల పరిమితిని పెంచాలి.
* ఇండస్ట్రీ స్టేటస్: రియల్ ఎస్టేట్ రంగానికి పరిశ్రమ హోదా ఇస్తే దీని వృద్ధికి మరింత సహాయపడుతుంది.
మొత్తానికి, రియల్ ఎస్టేట్ రంగం బడ్జెట్ 2025 నుంచి పలు కీలక విధాన మార్పులను ఆశిస్తోంది. గృహ కొనుగోలుదారులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచిచూడాలి.
Also Read :SEBI New Chief: మాధబి పురి బచ్‌కు టాటా - సెబీ కొత్త ఛైర్మన్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం