Mobile Prepaid 30 Days: మొబైల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు TRAI గుడ్ న్యూస్ చెప్పింది. 30 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లు, అలాగే Voice + SMS మాత్రమే ఉండే ప్లాన్లు అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. టెలికాం వినియోగదారుల సెక్యూరిటీ (13వ సవరణ) నిబంధనలు, 2026ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడించారు. ఈ కొత్త నిబంధనల ద్వారా వినియోగదారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.
ఏడాదికి 13 నుంచి 12 రీఛార్జ్‌లకు తగ్గింపు
గతంలో నెలవారీ రీఛార్జ్ పేరుతో వినియోగదారులు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై ఆ సమస్య ఉండదని రాఘవ్ చద్దా తెలిపారు. ట్రాయ్ కొత్త నిబంధనలతో 30 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులోకి రావడంతో, ఇకపై వినియోగదారులు సంవత్సరానికి 13 సార్లు కాకుండా కేవలం 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. Also Read: : ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
వాయిస్ ఓన్లీ ప్లాన్‌లు..
ఇంటర్నెట్ లేదా డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్ మాత్రమే కోరుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని ట్రాయ్‌ని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ ప్లాన్లలో ఇన్‌కమింగ్ అవుట్‌గోయింగ్ సేవలు రెండూ అందుబాటులో ఉంటాయని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, బడ్జెట్‌లో ఉండే మొబైల్ యూజర్లకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పరిమితమైన రీఛార్జ్ ఎంపికలపై ప్రజల నుంచి వచ్చిన ఆందోళనలను తాను మార్చి 11న పార్లమెంట్‌లో లేవనెత్తానని రాఘవ్ చద్దా తెలిపారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వానికి, ట్రాయ్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్మాణాత్మక రాజకీయాలకు ఇదొక గొప్ప నిదర్శనమని ఆయన అన్నారు. Also Read: ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
