Bank Holidays in June 2025: జూన్ నెల మొదలైంది. ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు  బంద్ ఉంటాయో తెలుసుకోవడం ద్వారా మీకు ఇబ్బంది ఉండదు. బ్యాంకు పనులున్న వారు సెలవుల జాబితా చెక్ చేసుకుని, తమ పనులు షెడ్యూల్ చేసుకుంటే మంచిదని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. జూన్ నెలలో 12 రోజులపాటు బ్యాంకులు సేవలు అందించవు. కస్టమర్లు ఈ తేదీలు తెలుసుకుని తమ ఆర్థిక కార్యకలాపాలను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే చెక్కులను డిపాజిట్ చేయడం, పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయడం లాంటి పనులకు బ్రాంచ్‌కు వెళ్లి ఇబ్బంది పడతారు. చివరి క్షణంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే  జూన్ నెలలో బ్యాంకుల సెలవుల గురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.  

ఈ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం, జూన్ నెలలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు 12 రోజులు సేవలు అందించవు. ఇందులో ఆదివారాలతో పాటు  రెండవ, నాల్గవ శనివారాల వంటి సెలవులు, ఇతర ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అయితే, 12 రోజుల బ్యాంకుల సెలవులు అన్నింటినీ దేశవ్యాప్తంగా అమలు కావు. రాష్ట్రాల్లో ప్రధాన రోజులను బట్టి బ్యాంకులు సేవలు అందిస్తాయి. 

జూన్ నెల సెలవుల పూర్తి జాబితా- 

  • జూన్ 1, ఆదివారం కనుక దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. 
  • జూన్ 6, శుక్రవారం ఈద్-ఉల్-అజ్హా లేదా బక్రీద్ రోజు కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. 
  • జూన్ 7, శనివారం చాలా రాష్ట్రాల్లో బక్రీద్ లేదా ఈద్-ఉల్-అజ్హా సెలవు. 
  • జూన్ 8, ఆదివారం ఎలాగూ బ్యాంకులకు సెలవు. 
  • జూన్ 11, బుధవారం - మతగురు కబీర్ జయంతి, సాగా దవా కారణంగా సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు బంద్  
  • జూన్ 14, రెండవ శనివారం కనుక బ్యాంకులు మూసి ఉంటాయి. 
  • జూన్ 15, ఆదివారం దేశవ్యాప్తంగా సాధారణ సెలవు. 
  • జూన్ 22, ఆదివారం కనుక బ్యాంకులు బంద్ ఉంటాయి. 
  • జూన్ 27, శుక్రవారం రథయాత్ర, కాంగ్ కారణంగా ఒడిశా, మణిపూర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. 
  • జూన్ 28, నాలుగవ శనివారం కాబట్టి అన్ని బ్యాంకులు మూసివేస్తారు
  • జూన్ 29, ఆదివారం కనుక బ్యాంకులకు సెలవు. 
  • జూన్ 30, సోమవారం మిజోరాంలో రెమ్నా నీ కారణంగా బ్యాంకులు బంద్ చేస్తారు  

జూన్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా

Date

Day

Holiday

Regions

June 1

Sunday

Weekend Holiday

 

All Over India

 

June 6

 

Friday

 

Id-ul-Ad’ha (Bakrid) 

Kochi and

Thiruvananthapuram

June 7

Saturday

Bakri ID (Id-Uz-Zuha) 

Agartala, Aizawl, Belapur, Bengaluru, Bhopal, Bhubaneswar, Chandigarh, Chennai, Dehradun, Guwahati, Hyderabad - Andhra Pradesh and Telangana, Imphal, Jaipur, Jammu, Kanpur, Kohima, Kolkata, Lucknow, Mumbai, Nagpur, New Delhi, Panaji, Patna, Raipur, Ranchi, Shillong, Shimla, and Srinagar

June 8

Sunday

Weekend Holiday

All Over India

June 11

 

Wednesday

 

Sant Guru Kabir Jayanti/Saga Dawa

 

Gangtok and Shimla

June 14

 

Saturday

 

Second Saturday

All Over India

June 15

 

Sunday

 

Weekend Holiday All Over India

June 22

 

Sunday

 

Weekend Holiday

All Over India

June 27

 

Friday

 

Ratha Yatra/Kang (Rathajatra)

 

Bhubaneswar and Imphal

June 28

 

Saturday

 

Fourth Saturday

All Over India

June 29

Sunday

Weekend Holiday

All Over India

June 30

 

Monday

 

Remna Ni

 

Aizawl