Bank Holidays List For June 2024: ప్రతి నెలా, బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను ముందుగానే తెలుసుకోవడం మనకు ఉపయోగపడుతుంది. దీనివల్ల, సెలవు రోజులు ముందుగానే తెలీడం వల్ల ఆ తేదీల్లో బ్యాంక్‌కు వెళ్లకుండా ఆగొచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాంక్‌లకు వరుసగా ఎక్కువ రోజులు సెలవులు వస్తుంటాయి. హాలిడేస్ లిస్ట్‌ను సేవ్ చేసి పెట్టుకోవడం వల్ల, బ్యాంక్ పని చేసే రోజులు కచ్చితంగా తెలుస్తాయి. కాబట్టి, ఆ రోజుల్లోనే పనిని ప్లాన్ చేసుకోవచ్చు, సమయం ఆదా చేసుకోవచ్చు.
జూన్ నెలలో వివిధ సందర్భాలు, 5 ఆదివారాలు, రెండో & నాలుగో శనివారాల కారణంగా బ్యాంక్‌లు 13 రోజులు పని చేయవు. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు, ప్రాంతాన్ని బట్టి మారతాయి.
2024 జూన్ నెలలో బ్యాంక్ సెలవు రోజులు (Bank Holidays in June 2024):
02 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా.
08 జూన్ 2024: (రెండో శనివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లను మూసేస్తారు
09 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
10 జూన్ 2024: (సోమవారం), శ్రీ గురు అర్జున్ దేవ్ జీ బలిదానం ----- పంజాబ్‌లో బ్యాంక్‌లకు సెలవు
14 జూన్ 2024: (శుక్రవారం), పహిలి రాజా ----- ఒడిశాలో బ్యాంక్‌లు పని చేయవు
15 జూన్ 2024: (శనివారం), రాజా సంక్రాంతి ----- ఒడిశాలో బ్యాంక్‌లు పని చేయవు
15 జూన్ 2024: (శనివారం), YMA డే ----- మిజోరంలో బ్యాంక్‌లను మూసివేస్తారు
16 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
17 జూన్ 2024: (సోమవారం), బక్రీద్/ఈద్ అల్ అధా ----- కొన్ని రాష్ట్రాలు మినహా జాతీయ సెలవుదినం
21 జూన్ 2024: (శుక్రవారం), వట్ సావిత్రి వ్రతం ----- చాలా రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు సెలవు
22 జూన్ 2024: (శనివారం), సంత్ గురు కబీర్ జయంతి ----- ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లో బ్యాంక్‌లు పని చేయవు. రెండో శనివారం కాబట్టి మిగిలిన రాష్టాల్లోనూ సెలవు.
23 జూన్ 2024: (ఆదివారం), దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
30 జూన్ 2024: రెమ్నా ని ----- మిజోరంలో సెలవు. ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు.
బ్యాంక్ సెలవు రోజుల్లోనూ లావాదేవీలకు ఇబ్బంది ఉండదు
మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి బ్యాంక్ సెలవులు కొన్ని పనులపై ప్రభావం చూపవు. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్ ముందుగానే మీకు తెలియజేస్తుంది.
భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: వాషింగ్ మెషీన్, TV, AC రేట్లు పెరగొచ్చు - కొనే ఆలోచన ఉంటే ఈరోజే షాపింగ్ చేయండి