Bank Holidays list in September 2023: మరికొన్ని రోజుల్లో మన దేశంలో పండుగల సీజన్‌ ప్రారంభం అవుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, మిలాద్-ఉన్-నబీ వంటి పండుగల నేపథ్యంలో వచ్చే నెలలో (సెప్టెంబర్‌) బ్యాంకులకు 16 రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్, సహకార బ్యాంకులకు కూడా హాలిడేస్ ఉన్నాయి. చెక్‌, డీడీ, డిపాజిట్‌, విత్‌డ్రా, కొత్త అకౌంట్‌ తెరవడం, లోన్స్‌ తీసుకోవడం, 2 వేల రూపాయల నోట్లు మార్చుకోవడం సహా ఈ నెలలో మీకు బ్యాంక్‌లో ఎలాంటి పనున్నా ముందు ఈ హాలిడేస్‌ లిస్ట్‌ సేవ్‌ చేసుకోండి. దీనివల్ల, సెలవు రోజుల మినహా మిగిలిన రోజుల్లో మీ పనిని ప్లాన్‌ చేసుకోవచ్చు, టైమ్‌ సేవ్‌ అవుతుంది.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ కస్టమర్ల కోసం, ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఆ లిస్ట్‌లో ఉంటాయి. సెప్టెంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 16 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా ఈ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. సెప్టెంబర్‌ 03న ఆదివారంతో మొదలై 29న మిలాద్-ఉన్-నబీతో హాలిడేస్‌ ముగుస్తాయి. బ్యాంకు సెలవులు ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి.


సెప్టెంబర్‌ నెలలో బ్యాంకుల సెలవు రోజులు:


3 సెప్టెంబర్ 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
6 సెప్టెంబర్ 2023- శ్రీ కృష్ణ జన్మాష్టమి కారణంగా భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పట్నాలో బ్యాంకులు పని చేయవు
సెప్టెంబర్ 7, 2023- శ్రీ కృష్ణ జన్మాష్టమి కారణంగా అహ్మదాబాద్, చండీగఢ్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, తెలంగాణ, జైపూర్, జమ్ము, కాన్పూర్, లఖ్‌నవూ, రాయ్‌పుర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 9, 2023- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 10, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 17, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 18, 2023- వినాయక చవితి కారణంగా తెలంగాణ, బెంగళూరులో బ్యాంకులు పని చేయవు
సెప్టెంబర్ 19, 2023- గణేష్ చతుర్థి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, భువనేశ్వర్, ముంబై, నాగ్‌పూర్, పనాజీలలో బ్యాంకులను మూసివేస్తారు
సెప్టెంబర్ 20, 2023- గణేష్ చతుర్థి, నుఖాయ్ కారణంగా కోచి, భువనేశ్వర్‌లో బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 22, 2023- శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా కోచి, పనాజీ, త్రివేండ్రంలో బ్యాంకులు పని చేయవు
సెప్టెంబర్ 23, 2023 – నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 24, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 25, 2023- శ్రీమంత్ శంకర్‌దేవ్ జన్మదినం కారణంగా గువాహటిలో బ్యాంకులకు సెలవు ఉంటుంది
సెప్టెంబర్ 27, 2023- మిలాద్-ఎ-షరీఫ్ కారణంగా జమ్ము, కోచి, శ్రీనగర్, త్రివేండ్రంలో బ్యాంకులను మూసివేస్తారు
సెప్టెంబర్ 28, 2023- ఈద్-ఇ-మిలాద్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు
సెప్టెంబర్ 29, 2023- ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ కారణంగా గాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులను మూసివేస్తారు


బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial