Bank Holidays List For April 2024: మీకు బ్యాంక్‌లో ఏదైనా పని ఉంటే, ఈ రోజు (01 ఏప్రిల్‌ 2024) మాత్రం అటు వైపు వెళ్లకండి. ఈ రోజు బ్యాంక్‌లు పని చేస్తున్నప్పటికీ, 2023-24 ఆర్థిక సంవత్సరం లెక్కలను క్లోజ్‌ చేసే పనిలో సిబ్బంది బిజీగా ఉంటారు. సాధారణ కార్యకలాపాలను అనుమతించరు. కాబట్టి, బ్యాంక్‌లో మీ పనిని రేపటికి వాయిదా వేసుకోండి. 


కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభ నెలలోనే దేశవ్యాప్తంగా బ్యాంకులకు చాలా సెలవులు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన వార్షిక సెలవుల జాబితా ప్రకారం, ప్రభుత్వ & ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ నెలలో 14 రోజులు పని చేయవు.


ఈ నెలలో ఉగాది (Ugadi 2024), గుడి పడ్వా (Gudi Padwa 2024), ఈద్-ఉల్-ఫితర్ (Ramadan 2024), బోహాగ్ బిహు, శ్రీరామ నవమి ‍‌(Rama Navami 2024), బైశాకి వంటి పండగలు, ఇతర సందర్భాల కారణంగా బ్యాంక్‌లకు సెలవులు వచ్చాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి మారతాయి. ఒక రోజు ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే, అదే రోజు మిగిలిన రాష్ట్రాల్లో బ్యాంక్‌లు పని చేయవచ్చు. ఏప్రిల్‌ నెలలోని 4 ఆదివారాలు, రెండు & నాలుగు శనివారాల్లో మాత్రం దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు. 


ఏప్రిల్‌ నెలలో మీకు బ్యాంక్‌లో ఏ పని ఉన్నా, బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగా సేవ్‌ చేసుకోండి. సెలవు రోజులను గుర్తు పెట్టుకుంటే, ఆ రోజుల్లో బ్యాంక్‌కు వెళ్లకుండా ఆగొచ్చు, సమయం వృథా కాకుండా ఉంటుంది.


2024 ఏప్రిల్‌లో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in April 2024): 


- ఏప్రిల్ 01 (సోమవారం): వార్షిక ఖాతాల ముగింపు కోసం బ్యాంకులను మూసివేస్తారు, లావాదేవీలు జరగవు. 
- ఏప్రిల్ 05 ‍‌(శుక్రవారం): బాబు జగ్జీవన్ రామ్ జయంతి, జుమాత్-ఉల్-విదా
- ఏప్రిల్ 07‍: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
- ఏప్రిల్ 09 ‍‌(మంగళవారం): గుడి పడ్వా, ఉగాది, సాజిబు నొంగ్మపన్బా (చెయిరాబా), 1వ నవరాత్రి
- ఏప్రిల్ 10 ‍‌(బుధవారం): రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్)
- ఏప్రిల్ 11 ‍‌(గురువారం): రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) (1వ షావాల్)
- ఏప్రిల్ 13‍: బోహాగ్ బిహు, చీరోబా, బైశాఖి, బిజు పండుగ + రెండో శనివారం
- ఏప్రిల్ 14: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
- ఏప్రిల్ 15 ‍‌(సోమవారం): బోహాగ్ బిహు, హిమాచల్ డే
- ఏప్రిల్ 17 (బుధవారం): శ్రీరామ నవమి
- ఏప్రిల్ 20 (శనివారం): గరియా పూజ
- ఏప్రిల్ 21: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
- ఏప్రిల్ 27: నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
- ఏప్రిల్ 28: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు


ప్రస్తుతం, మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, బ్యాంక్‌ సెలవులు మీ పనులపై పెద్దగా ప్రభావం చూపవు. ఈ డిజిటల్‌ సర్వీస్‌లు 24 గంటలూ, భారతదేశం అంతటా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్‌ ముందుగానే మీకు తెలియజేస్తుంది. 


మరో ఆసక్తికర కథనం: ఈ రోజు నుంచి మన జీవితాల్లో మార్పులు, అన్నీ డబ్బుతో ముడిపడినవే!