Bank Holidays in January 2024: మరికొన్ని రోజుల్లో మకర సంక్రాంతి, పొంగల్‌ పండుగలు రాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్‌ (Pongal 2024 holiday) పేరిట జరుపుకునే ఈ పర్వదినం దక్షిణాదిలోని అతి పెద్ద పండుగల్లో ఒకటి. కాబట్టి, ఆ రోజున (సోమవారం, 15 జనవరి 2024) చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. జనవరి 13వ తేదీన రెండో శనివారం, 14వ తేదీన ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వీటితోపాటు.. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పండుగలు, సందర్భాల కారణంగా జనవరి 16 (మంగళవారం), జనవరి 17 తేదీల్లో (బుధవారం) కూడా బ్యాంకులను మూసేస్తారు. ఈ లెక్కన బ్యాంక్‌లకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి. మీకు బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఈ లాంగ్‌ గ్యాప్‌లో ఇబ్బంది పడకుండా శుక్రవారమే ఆ పనిని పూర్తి చేయడం మంచిది. 


వచ్చే వారంలో బ్యాంక్‌ సెలవులు (Bank holidays next week)            


జనవరి 13, 2024- రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు                
జనవరి 14, 2024- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
జనవరి 15, 2024- మకర సంక్రాంతి/పొంగల్/తిరువళ్లువర్ డే/మాగ్ బిహు కారణంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, గువాహటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు
జనవరి 16, 2024- తిరువళ్లువర్ దినోత్సవం కారణంగా చెన్నైలో బ్యాంకులకు సెలవు ఇచ్చారు
జనవరి 17, 2024- ఉజ్హవర్ తిరునాళ్‌ కారణంగా చెన్నైలో బ్యాంకులు మూతబడతాయి


మరో ఆసక్తికర కథనం: మళ్లీ షాక్‌ ఇచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే 


ఇవి కాకుండా, ఈ నెలలో మరో 7 రోజులు బ్యాంక్‌లు సెలవుల్లో ఉంటాయి               


జనవరి 21, 2024- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
జనవరి 22, 2024- ఇమోయిను ఇరాప్తా కారణంగా ఇంఫాల్‌లోని బ్యాంకులు పని చేయవు
జనవరి 23, 2024- ఇంఫాల్‌లో స్థానిక పండుగ కారణంగా బ్యాంకులు మూసివేస్తారు
జనవరి 25, 2024- థాయ్ పోషం/హజ్రత్ మొహమ్మద్ అలీ పుట్టినరోజు కారణంగా చెన్నై, కాన్పూర్, లఖ్‌నవులోని బ్యాంకులకు సెలవు ఇచ్చారు
జనవరి 26, 2024- గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
జనవరి 27, 2024- నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
జనవరి 28, 2024- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు


సుదీర్ఘ సెలవుల్లో బ్యాంక్‌ పనులు ఎలా పూర్తి చేయాలి?               
బ్యాంక్‌లకు వరుసగా రోజుల తరబడి సెలవులు వచ్చినా కస్టమర్లు పెద్దగా ఇబ్బంది పడకుండా ఇప్పుడు టెక్నాలజీ మారింది. బ్యాంకింగ్‌ వ్యవస్థ మొత్తం అరచేతిలో ఇమిడే స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చింది. బ్యాంక్‌ సెలవు రోజుల్లో ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయాలనుకుంటే, UPI, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్‌ను ఉపయోగించవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ATM ఉపయోగించవచ్చు. ఈ ఫెసిలిటీలన్నీ ఏడాదిలో అన్ని రోజులు, రోజులో 24 గంటలూ పని చేస్తాయి.


మరో ఆసక్తికర కథనం: 100 బిలియన్ డాలర్ల పార్టీలో అంబానీ, రిలయన్స్‌ షేర్ల రైజింగ్‌తో మారిన రేంజ్‌