Tata group stocks: 2021లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన చాలా టాటా గ్రూప్ స్టాక్స్, 2022లో మాత్రం చతికిలబడ్డాయి. ఇన్వెస్టర్ల కొంప కొలంబో చేశాయి.
సోమవారం (05 డిసెంబర్ 2022) నాటికి టాటా గ్రూప్‌లోని 13 స్టాక్స్ 0.4 శాతం నుంచి 51 శాతం వరకు నెగెటివ్ రిటర్న్స్‌లో ఉన్నాయి. వీటిలో 5 షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులు ఇలాగే బుల్లిష్‌గా కొనసాగితే, ఈ 5 స్క్రిప్స్ తిప్పుకుని, తిరిగి లాభాల్లోకి రావచ్చు. మిగిలిన 8 షేర్లు మాత్రం గట్టి తిరోమనంలో ఉన్నాయి. 2022లో ఇవి నష్టాల్లోనే ముగిసే ఛాన్స్ కనిపిస్తోంది.
అండర్ పెర్‌ఫార్మర్లలో పెద్ద పేర్లు
ఈ 13 అండర్ పెర్‌ఫార్మర్లలో టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టాటా మోటార్స్ వంటి ఫ్లాగ్‌షిప్ పేర్లు కూడా ఉన్నాయి. ఇవి, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) దాదాపు 5 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గాయి. 2021లో ఇవే పేర్లు 30 శాతం నుంచి 163 శాతం వరకు లాభపడ్డాయి.
టాటా ప్యాక్‌లోని అండర్ పెర్‌ఫార్మర్స్
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు... టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్ −51.41, టాయో రోల్స్ -46.02, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ -39.85, ఆర్ట్‌సన్ ఇంజినీరింగ్ -35.36, ఓల్టాస్ -30.91, ర్యాలీస్ ఇండియా −12.19, టాటా కమ్యూనికేషన్స్ -11.5, టాటా మోటార్స్ -9.13, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ -8.45, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ −7, టాటా మెటాలిక్స్ -6.99, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా -5.34, టాటా స్టీల్ -0.4 క్షీణించాయి.
కరోనా వ్యాప్తి & ప్రజల రాకపోకలు, రవాణా మీద ఆంక్షలు, ఉక్రెయిన్ - రష్యా సైనిక యుద్ధం, అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, అధిక ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధాన చర్యలు వంటి గ్లోబల్ గ్రాస్ మ్యాక్రో ఎకనమిక్ రిస్క్‌లు 2022లో మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చాయి. ఆ ప్రభావంతో కంపెనీల ఆదాయాలు తగ్గాయి. ఫలితంగా స్టాక్ ధరలు పడిపోయాయి. రిస్క్- రివార్డ్ మారిపోయింది.
ఇదే సమయంలో, టాటా ప్యాక్‌లో కొన్ని ఔట్ పెర్ఫార్మర్స్ కూడా ఉన్నాయి. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని, బలమైన రాబడిని అవి అందించాయి. ఇన్వెస్టర్ల ఇంట సిరులు కురిపించాయి.
టాటా ప్యాక్‌లోని ఔట్ పెర్‌ఫార్మర్స్
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు... టాటా పవర్ కో 1.79, టైటాన్ కో 4.54, టాటా కాఫీ 8.96, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 9.42, నెల్కో 9.7, టాటా కెమికల్స్ 17.37, టిన్‌ప్లేట్ కంపెనీ 18.37, TRF 20.46 టాటా ఎల్క్సీ 20.6, ట్రెంట్ 37.32, తేజస్ నెట్‌వర్క్స్ 57.94, బెనారస్ హోటల్స్ 64.27, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ 72.83, ఇండియన్ హోటల్స్ కంపెనీ 79.4, ఓరియంటల్ హోటల్స్ 112.8 లాభపడ్డాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.