Apple - Bharat Forge Talks: ఆపిల్‌ ఐఫోన్‌ తయారీ కేంద్రంగా, భారత్‌, తన స్థాయిని క్రమంగా మెరుగు పరుచుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అత్యంత ఇష్టమైన ఐఫోన్‌ల ఉత్పత్తి భారత్‌ నుంచి (iPhones Manufachuring From India) మరింత పెరగనుంది. తాజాగా, మరో భారతీయ కంపెనీ ఆపిల్‌ ఐఫోన్‌లను భారతదేశంలో ఉత్పత్తి చేయనుంది. కళ్యాణి గ్రూపునకు చెందిన భారత్ ఫోర్జ్ కంపెనీతో ఆపిల్‌ యాజమాన్యం చర్చలు జరుపుతోంది.

మన పొరుగు దేశం చైనా (China) చర్యలతో ఆపిల్‌ ఇంక్‌ విసిగిపోయింది. అందువల్ల, డ్రాగన్‌ కంట్రీ వెలుపల & ఆసియా లోపల పెద్ద ఉత్పత్తి కేంద్రం కోసం ఆపిల్‌ వెదుకుతోంది. ఆ సంస్థకు భారత్‌ ఇంపుగా కనిపిస్తోంది. ఆపిల్‌ ఐఫోన్‌లు సహా చాలా ఆపిల్‌ ఉత్పత్తుల అసెంబ్లింగ్‌ ఇప్పటికే మన దేశంలో జరుగుతోంది. చైనాను విడిచిపెడుతున్న ఆపిల్‌ కంపెనీకి భారత్‌లో భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల, ఆపిల్‌ భారతదేశంలో తయారీని మరింత విస్తరించనుంది. భారత్ ఫోర్జ్ కంపెనీతో ఆపిల్‌ యాజమాన్యం మీటింగ్స్‌ కొనసాగుతున్నాయి. ఈ చర్చలు సఫలమైతే, ఆపిల్‌ ఐఫోన్లు ఎక్కువగా ఇండియాలోనే తయారవుతాయి. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ (Foxconn India Pvt Ltd) ఇప్పటికే ఆపిల్‌ ఐఫోన్‌లను భారతదేశంలోని తమిళనాడు & కర్ణాటకలో ఉన్న ఫ్యాక్టరీలలో తయారు చేస్తోంది.    

టాటా, మదర్‌సన్‌లతోనూ జరుగుతున్న చర్చలుఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఐఫోన్ల ఉత్పత్తి కోసం ఆపిల్ కంపెనీ టాటా గ్రూప్‌ (Tata Group) & మదర్సన్ గ్రూప్‌ (Motherson Group)తో కూడా మాట్లాడుతోంది. ఈ కంపెనీల ద్వారా భారత్‌లో ఐఫోన్ అసెంబ్లింగ్‌ను పెంచేందుకు ఆపిల్‌ ఇంక్‌ ప్రయత్నాలు చేస్తోంది. టాటా కంపెనీ ఇప్పటికే ఆపిల్‌ ఐఫోన్ కోసం విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు, ఐఫోన్ మెకానిక్స్ ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా, సరఫరాదారుగా కూడా టాటా కంపెనీ మద్దతును ఆపిల్ కోరుతోంది. తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ సహాయంతో, భారతదేశంలో జరుగుతున్న ఐఫోన్ తయారీని విస్తరించడానికి ఆపిల్ కూడా సిద్ధమవుతోంది. ఒక అంచనా ప్రకారం, భారతదేశంలో ఆపిల్ ఉత్పత్తుల తయారీ, దాని విలువ గొలుసు & సరఫరా గొలుసులో ఆరు లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. భారతదేశంలో ఆపిల్‌ ఇంక్‌ తాజా విస్తరణతో ఈ ఉద్యోగాల సంఖ్య రెట్టింపు కావచ్చని అంచనా.         

గతేడాది 12.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లు ఎగుమతి2024లో, మన దేశంలో 17.5 బిలియన్ డాలర్ల విలువైన ఆపిల్‌ ఐఫోన్‌లు తయారయ్యాయి. వీటిలో 12.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి. ఐఫోన్ల తయారీని చైనా నుంచి మన దేశానికి మారిస్తే, తయారీ & ఎగుమతుల డేటా గణనీయంగా పెరగవచ్చు. భారత్ ఫోర్జ్ కంపెనీ త్వరలో భారతదేశంలో ఆపిల్‌ తయారీ భాగస్వామిగా మారుతుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.            

మరో ఆసక్తికర కథనం: బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు