APM Terminals Investments in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉన్న అవకాశాలను సద్వినియోగపరుచుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లభించింది. ప్రపంచవ్యాప్తంగా కార్గో రవాణాలో దిగ్గజంగా ఉన్న ఏపీఎం టెర్మినల్స్ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. 26వ తేదీన ఈ మేరకు ఒప్మెపందం కుదిరింది. మెర్సెక్ పేరుతో అంతర్జాతీయంగా సముద్ర రవాణాను ఈ కంపెనీ నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు , APM టెర్మినల్స్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. రూ. 8,000–9,000 కోట్ల పెట్టుబడి , 8,000–10,000 ఉద్యోగాల సృష్టితో, ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి నైపుణ్యం, ప్రపంచ కనెక్టివిటీ , స్థిరమైన లాజిస్టిక్స్ పరిష్కారాలను తీసుకువస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం, గ్రీన్ షిప్పింగ్‌ను స్వీకరించడం, ఆంధ్రప్రదేశ్‌ను పోటీ ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఉంచడం అనే ఆంధ్రప్రదేశ్ దార్శనికతను ఈ సహకారం ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెలవప్‌మెంట్ బోర్డు తెలిపింది.
APM టెర్మినల్స్ 2004 నుండి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఉన్న గుజరాత్ పిపావావ్ పోర్ట్ లిమిటెడ్ , మహారాష్ట్రలోని JNPA పోర్ట్‌లో ఉన్న గేట్‌వే టెర్మినల్స్ ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంటైనర్, బల్క్ హ్యాండ్లింగ్‌లో సామర్థ్యాన్ని పెంచడంలో కంపెనీ ముందంజలో ఉంది. ఏపీలోనూ పోర్టులను ప్రపంచ స్థాయికి మార్చి రవాణా మెరుగుపర్చనుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ కార్గో రంగంలో హాట్ టాపిక్ గా మారింది. [
దావోస్‌లో మెర్సెక్ ఓనర్‌తో చంద్రబాబు పది నిమిషాల సమావేశమే పెట్టుబడులకు మార్గం చూపించిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
పోర్టులు, సముద్ర తీరం ద్వారా ఆర్థిక వ్యవస్థకు మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇలా దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం వల్ల.. ఉపాధి,ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు. ప్రపంచ కార్గో రంగంలో ఏపీ ప్రముఖంగా నిలబడే అవకాశం ఉంది.