Amul Slashes Prices After GST Reforms: జీఎస్టీ పన్నుల శ్లాబుల తగ్గింపుతో అమూల్ బ్రాండ్ పాల ఉత్పత్తుల రేట్లను తగ్గించింది. అమూల్ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) నెయ్యి, వెన్న, ఐస్‌క్రీం, చీజ్, ఫ్రోజెన్ స్నాక్స్ వంటి 700 కంటే ఎక్కువ ఉత్పత్తులపై ధరల తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం GST రేట్లను తగ్గించిన నేపథ్యంలో అమూల్ తన వినియోగదారులకు పూర్తి ప్రయోజనాన్ని అందించాలని నిర్ణయించింది.
ధరల తగ్గింపులో ముఖ్యమైనవి
* వెన్న (100 గ్రాముల ప్యాక్): రూ. 62 నుంచి రూ.58కి తగ్గింపు* నెయ్యి (1 లీటర్): రూ.650 నుంచి తగ్గిన ధర రూ.40 * ప్రాసెస్డ్ చీజ్ (1 కిలో): రూ.30 తగ్గించడంతో ప్రస్తత ధర రూ.545* ఫ్రోజెన్ పనీర్ (200 గ్రాములు): కొత్త ధర ₹95, రూ.99 నుంచి తగ్గింది
టర్నోవర్ పెరుగుతుందని సంస్థ ఆశలుపాలు, పనీర్, చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులు, వేరుశెనగ స్ప్రెడ్‌లు, మాల్ట్ ఆధారిత పానీయాలు, కండెన్స్‌డ్ మిల్క్, ఫ్రోజెన్ బంగాళాదుంప స్నాక్స్‌తో సహా పలు కేటగిరీల ప్రొడక్ట్స్‌పై ధరలు తగ్గించింది. 3.6 మిలియన్ల మంది రైతుల యాజమాన్యంలో నడుస్తున్న GCMMFలో ఈ సవరణతో అమూల్ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరగనుందని సంస్థ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఐస్ క్రీం, వెన్న, జున్ను వంటి ఉత్పత్తులకు భారీగా పెరగనుందని భావిస్తోంది.
‘ధరల తగ్గింపు విస్తృత శ్రేణి పాల ఉత్పత్తుల వినియోగాన్ని, ముఖ్యంగా ఐస్ క్రీం, జున్ను మరియు వెన్న వినియోగాన్ని పెంచుతుందని అమూల్ నమ్ముతోంది. ఇది భారీ డిమాండ్ అవకాశాన్ని సృష్టిస్తుంది’ అని GCMMF ఓ ప్రకటనలో తెలిపింది.
సవరించిన ధరల విషయాన్ని దేశంలోని డిస్ట్రిబ్యూటర్లు, అమూల్ పార్లర్లు, రిటైలర్లకు తెలియజేసినట్లు కూడా తెలిపింది. సవరించిన ధరలను సెప్టెంబర్ 22 నుంచి ఈ ధరలు సజావుగా అమలు అయ్యేలా చూడాలని దేశవ్యాప్తంగా వాణిజ్య భాగస్వాములకు తెలియజేసినట్లు పేర్కొంది. ఈ తగ్గింపు వినియోగదారుల డిమాండ్‌ను పెంచడమే కాకుండా వచ్చే సంవత్సరంలో సంస్థ టర్నోవర్ వృద్ధిని స్పీడప్ చేయడంలో సహాయపడుతుందని GCMMF పేర్కొంది.