Air India Wifi : టాటా గ్రూప్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఓ కొత్త ప్రకటన జారీ చేసింది. నిత్యం ప్రయాణాలు చేసే వాళ్లు మాత్రం ఫోన్‌లో సిగ్నల్స్ లేక.. ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్ ఇండియా తన దేశీయ, అంతర్జాతీయ విమానాలలో వై-ఫై (Wi-Fi) ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787-9తో పాటు ఎంపిక చేసిన ఏ321 నియో విమానాల్లో ఈ సేవలు లభిస్తాయి. టాటా గ్రూప్ క్యారియర్ దేశీయ మార్గాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా అవతరించినట్టు ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీస్ ను తొలుత కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్టు వెల్లడించింది. క్రమంగా ఇతర విమానాల్లోనూ ఈ సేవలను విస్తరిస్తామని చెప్పింది.
ప్రస్తుతానికి, ఎయిర్‌లైన్ దాని ఎయిర్‌బస్ A350, బోయింగ్ 787-9 లాంటి కొన్ని ఎయిర్‌బస్ A321 నియో విమానాలలో Wi-Fi కనెక్టివిటీని అందిస్తోంది. క్యారియర్ అంతర్జాతీయ విమానాలు ఇప్పటికే కొనసాగుతున్న పైలట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రయాణీకులకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తున్నాయి. ఈ క్యారియర్‌లన్నింటికీ విమానంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి అవసరమైన ప్రత్యేక హార్డ్‌వేర్‌ను అమర్చారు. దీనికి కొనసాగింపుగా దేశీయంగానూ ఈ సేవలను ప్రారంభించినట్టు ఎయిరిండియా తెలిపింది. ఈ సేవలను ప్రయాణీకులు ల్యాప్ టాప్, ట్యాబ్లెట్లు, ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వంటి డివైజెస్ లో ఆనందించవచ్చు. అయితే ఎయిరిండియా అందుకు ఓ షరతు విధించింది. విమానం 10వేల అడుగుల ఎత్తుకు చేరాకే ఈ వై-ఫై సేవలు వినియోగించుకునేందుకు వెసులుబాటు ఉంటుందని చెప్పింది. అంతేకాదు ఈ వై-ఫై సాయంతో ఒకేసారి అనేక డివైజ్ లను కనెక్ట్ చేయొచ్చు.
సోషల్ మీడియా యూజర్స్ కు గుడ్ న్యూస్
సోషల్ మీడియాను ఎక్కువ ఉపయోగించేవారికి ఎయిరిండియా ప్రకటన మేలు చేకూర్చనుంది. బోరింగ్ గా ఫీలయ్యేవారికి ఈ సర్వీస్ మంచి అవకాశంగా మారనుంది. ఫ్లైట్ లో ఎంటర్టైన్మెంట్ ను ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పవచ్చు.
100 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ముందడుగు
దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది. టాటా గ్రూప్ కంపెనీకి చెందిన ఈ విమానయాన సంస్థ.. యూరప్ కు చెందిన విమాన తయారీ కంపెనీ ఎయిర్ బస్ నుంటి మరో 100 కొత్త విమానాలన ఆర్డర్ చేసినట్టు తెలిపింది. ఇందులో 90 నారో బాడీ 320 విమానాలుండగా, 10 వైడ్ బాడీ 350 విమానాలు ఉండనున్నాయి. 2023 ఫిబ్రవరిలో ఎయిరిండియా 470 విమానల కొనుగోలు కోసం ఆర్డర్ ఇవ్వగా.. వీటిలో ఎయిర్ బస్ నుంచి A250, బోయింగ్ నుంచి A220 విమానాలున్నాయి. ఈ ఆర్డర్ తో ఎయిరిండియా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సింగిల్ ట్రాంచ్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలుగా చరిత్ర సృష్టించింది.
Also Read : New Year Gift Ideas: మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?